Telugu News » Bjp First List: బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..!!

Bjp First List: బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..!!

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది. 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం మధ్యాహ్నం హైకమాండ్ విడుదల చేసింది.

by Mano
Bjp First List: First list of BJP Telangana candidates released..!!

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది. 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం మధ్యాహ్నం హైకమాండ్ విడుదల చేసింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ అర్వింద్, రాజాసింగ్ వంటి అగ్రనేతలందరి పేర్లు ఫస్ట్ లిస్ట్‌లోనే ప్రకటించారు.

Bjp First List: First list of BJP Telangana candidates released..!!

52 మంది అభ్యర్థుల్లో 20 మంది బీసీలు, 6 గురు వెలమలు, 14 మంది రెడ్లు, 14మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. కాగా, మొదటి లిస్టులో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, విజయశాంతి, డీకే అరుణ పేర్లు లేకపోవడం గమనార్హం.

ఇప్పటికే బీఆర్ఎస్ 119 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్ 55మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఆ 55 మంది అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ఇవాళ బీజేపీ సైతం 52 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడంతో రేపటి నుంచి రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది.

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

  • తుంగతుర్తి – కడియం రామచంద్రయ్య
  • జనగామ-A.దశ్మంత్ రెడ్డి
  •  స్టేషన్ ఘన్పూర్-గుండె విజయరామారావు
  • పాలకుర్తి-లేగ రామ్మోహన్ రెడ్డి
  • డోర్నకల్-భూక్య సంగీత
  • మహబూబాబాద్- జతోత్ హుస్సేన్ నాయక్
  • వరంగల్(W)-రావు పద్మ
  •  వరంగల్ (E)- ఎర్రబెల్లి ప్రదీప్ రావు
  • వర్ధన్నపేట- కొండేటి శ్రీధర్,
  • భూపాలపల్లి- CH.కీర్తిరెడ్డి
  • ఇల్లందు –రవీంద్ర నాయక్
  • భద్రాచలం-కె.ధర్మారావు
  • జగిత్యాల-బోగ శ్రావణి
  • ధర్మపురి-ఎస్.కుమార్
  • రామగుండం- సంధ్యా రాణి
  • కరీంగనర్-బండి సంజయ్
  • చొప్పదండి-బొడిగ శోభ
  • సిరిసిల్ల- రాణి రుద్రమ
  • మానకొండూర్-ఆరేపల్లి మోహన్
  • హుజూరాబాద్, గజ్వేల్- ఈటల రాజేందర్
  • నర్సాపూర్-మురళీ యాదవ్
  • పటాన్ చెరువు – నందీశ్వర్‌గౌడ్
  • దుబ్బాక-రఘునందన్,
  • కుత్బుల్లాపూర్- శ్రీశైలం గౌడ్
  • ఇబ్రహీంపట్నం- దయానంద్ గౌడ్
  • మహేశ్వరం- శ్రీరాములు,
  • ఖైరతాబాద్- చింతల
  • గోషామహల్- రాజాసింగ్
  • చార్మినార్- మేఘా రాణి
  • చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ
  • యాకుత్పుర-వీరేందర్ యాదవ్
  • బహదూర్పుర- నరేశ్ కుమార్
  • కల్వకుర్తి- తల్లోజు ఆచారి, కొల్లాపూర్- ఆలేని సుధాకర్
  • నాగార్జున సాగర్- కంకనాల నివేదితా రెడ్డి
  • సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
  • భువనగిరి- గూడూరు నారాయణ రెడ్డి
  • సిర్పూర్-పాల్వాయి- హరీశ్ బాబు
  • బెల్లంపల్లి – అమర్రాజుల శ్రీదేవి
  • ఖానాపూర్-రమేశ్ రాథోడ్
  • ఆదిలాబాద్-పాయల్ శంకర్
  • బోధ్- సోయం బాపూరావు
  • నిర్మల్-ఆలేటి మహేశ్వర్‌రెడ్డి
  • ముథోల్-రామారావు పటేల్
  • ఆర్మూర్- పైడి రాకేశ్‌రెడ్డి
  • జుక్కల్- అరుణతార,
  • కామారెడ్డి-వెంకట రమణారెడ్డి
  • నిజామాబాద్ (U) – సూర్య నారాయణ
  • గుప్త బాల్కొండ-అన్నపూర్ణ ఆలేటి,
  • కోరుట్ల- ధర్మపురి అరవింద్.

You may also like

Leave a Comment