Telugu News » Vijaya Santhi: ఏ ఆడబిడ్డ అయినా సరే నిర్దోషులుగానే నిలవాలి: విజయశాంతి!

Vijaya Santhi: ఏ ఆడబిడ్డ అయినా సరే నిర్దోషులుగానే నిలవాలి: విజయశాంతి!

ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు అన్నారు. ఈడీ నోటీసులు ఇప్పుడు పంపడం, కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత అన్న మాటలను విజయశాంతి తప్పుపట్టారు.

by Sai
bjp leader vijayasanthi on brs mlc kavitha ed notice hyderabad

మాజీ ఎంపీ విజయశాంతి మరోసారి టీఆర్ఎస్ పార్టీపై… ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు పై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద విజయశాంతి సానుభూతి ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు అందించిన విషయం తెలిసిందే.

bjp leader vijayasanthi on brs mlc kavitha ed notice hyderabad

ఈ నేపథ్యంలోనే విజయశాంతి సానుభూతి తెలుపుతూ పోస్ట్ చేశారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఆడబిడ్డ అయినా సరే నిర్దోషులుగానే ఎప్పుడు నిలవాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు అన్నారు. ఈడీ నోటీసులు ఇప్పుడు పంపడం, కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత అన్న మాటలను విజయశాంతి తప్పుపట్టారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్టు బీజేపీకి రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఆమె అరెస్ట్ కావాలని కోరుకోవడం బీజేపీకి అవసరమేం లేదన్నారు. ఆ ఆవశ్యకత కూడా బీజేపీకి లేదు అంటూ విజయశాంతి వివరణ ఇచ్చారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న అనేక సమస్యలపై చర్యలు తీసుకోవడానికి నిర్దేశించబడిన ప్రభుత్వ సంస్థలు ఈడీ, సీబీఐ లు అన్నారు.

అవి తమ పని తాము నిర్వహిస్తాయి. కవిత గారు అరెస్టు కానట్లయితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే భావంతో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు చేయొచ్చు అన్న భయం టీఆర్ఎస్ కు, ఎంఐఎం ప్రేరేపితుల్లో ఉండొచ్చు. కానీ, జాతీయవాదా బీజేపీకి ఆ ఆలోచన ధోరణి ఉండదు అని విజయశాంతి చెప్పుకొచ్చారు. కొంతమంది బీఆర్ఎస్ ప్రోత్బలంతోనే గతంలో ఒకసారి అప్రూవల్ గా ఉండి.. మళ్లీ కిలాఫ్ గా మారి, తిరిగి మళ్లీ అప్రూవల్ గా మారుతున్నారని అభిప్రాయం వినవస్తుందంటూ ఈ పోస్టులో విజయశాంతి పేర్కొన్నారు.

కాగా, ఈ కేసులో నిందితుడుగా ఉన్న హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లై మొదట అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అప్రూవర్ గా మారడం, న్యాయమూర్తి ముందు అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఇవ్వడం.. ఆ తర్వాత వెంటనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపించడం వెంట వెంటనే జరిగిపోయాయి.

దీని మీద కవిత స్పందిస్తూ ఇవి అంత ఏదో టీవీ సీరియల్ లాగా ఉందని… ఈడీ నోటీసులు కాదు, మోడీ నోటీసులు అంటూ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు స్థితులు, రానున్న ఎన్నికల నేపథ్యంలోనే రాజకీయ లబ్ధి కోసమే నోటీసులు పంపారని కవిత చెప్పుకొచ్చారు. అంతేకాదు, తాను ఈడీ విచారణకు హాజరు కాబోనని కూడా తెలిపారు.

You may also like

Leave a Comment