Telugu News » BJP : బీజేపీలో సీట్ల లొల్లి.. ఆ నియోజక అభ్యర్థి మార్పు ఖాయమా..?

BJP : బీజేపీలో సీట్ల లొల్లి.. ఆ నియోజక అభ్యర్థి మార్పు ఖాయమా..?

గోమాసేకు టికెట్ ఇవ్వాలా వద్దా అనే సంశయంలో ముఖ్య నేతలున్నట్లు తెలుస్తోంది. ఈయన స్థానంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు ఇవ్వాలనే భావనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

by Venu
MP Venkatesh: Venkatesh leader resigns from the post of MP.. Sensational allegations against BRS..!

రాష్ట్రంలో ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎంపీ బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్స్ వేయడంలో బిజీగా మారిపోయారు.. కానీ, ప్రధాన పార్టీల్లో టికెట్ల పంచాయితీ ఇంకా తెగ లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీ (BJP)లో సీట్ల లొల్లి ఇంకా కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పెద్దపల్లి బీజేపీ టికెట్‌కు సబంధించిన పంచాయితీ తెరమీదికి వచ్చింది. ఇప్పటికే ఈ స్థానం నుంచి అభ్యర్థిగా గోమాసే శ్రీనివాస్ పేరును అధిష్టానం ప్రకటించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పునరాలోచనలో పడిందనే టాక్ వినిపిస్తోంది. గోమాసేకు టికెట్ ఇవ్వాలా వద్దా అనే సంశయంలో ముఖ్య నేతలున్నట్లు తెలుస్తోంది. ఈయన స్థానంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు ఇవ్వాలనే భావనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ అయిన వెంకటేష్ నేత ఇటీవలే బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లో చేరారు. అయితే, ఈ సారి కూడా టికెట్ తనదే అనే ధీమాలో ఉన్న ఆయనకి హస్తం హ్యాండ్ ఇచ్చింది. వెంటనే బీజేపీ వైపు మళ్లిన ఆయన.. టికెట్ ఇస్తానంటే పార్టీలో చేరుతాననే హింట్ నేతలకు ఇచ్చారు.. ఈ క్రమంలో.. బీజేపీ అధిష్టానం ప్రస్తుతం పెద్దపల్లి టికెట్ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

అందుకే కమలదళం పెద్దపల్లి (Peddapalli) విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తోందని అనుకొంటున్నారు.. కాగా ప్రస్తుతానికైతే వెంకటేష్ నేత వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.. ఇక ఈ విషయంలో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment