Telugu News » BRS : కాంగ్రెస్ కొత్త నాటకం ఆడుతోంది.. బీఆర్ఎస్ నేతల కీలక ఆరోపణలు..!

BRS : కాంగ్రెస్ కొత్త నాటకం ఆడుతోంది.. బీఆర్ఎస్ నేతల కీలక ఆరోపణలు..!

పార్లమెంట్ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం ఆడుతుందన్న పువ్వాడ.. తనపై వచ్చిన ఆరోపణలపై దమ్ముంటే విచారణ చేయాలని, అవసరం అయితే సీబీఐతో కూడా విచారణ చేయాలని డిమాండ్ చేసారు..

by Venu
Puvvada Ajaykumar: 'Within 4 months, Congress government has proved itself..'!!

బీఆర్ఎస్ (BRS) ఎంపీ వద్దిరాజు (MP Vadiraju) ప్రెస్ మీట్ లో కీలక కామెంట్స్ చేశారు.. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో గళం విప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ..కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే వంద రోజుల్లో వారి భాగోతం బయటపడిందని.. ప్రస్తుతం సంక్షేమ రాష్ట్రం నుంచి సంక్షోభంలోకి తీసుకెళ్లిందని విమర్శించారు..

Controversy of food donors under Congress rule.. BRS sensational post viral!అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరమీదికి తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు పువ్వాడ అజయ్ (Puvvada Ajay) సైతం కాంగ్రెస్ విధానాలపై ఆరోపణలు గుప్పించారు.. ఇచ్చిన హామిలు అమలు చేయకుండా ప్రజలను వివిధ అంశాలపైకి దృష్టి మళ్లిస్తుందన్నారు.. మంత్రి తుమ్మలపై తాను సుపారీ ఇచ్చి దాడులు చేయిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు..

ఇక పార్లమెంట్ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం ఆడుతుందన్న పువ్వాడ.. తనపై వచ్చిన ఆరోపణలపై దమ్ముంటే విచారణ చేయాలని, అవసరం అయితే సీబీఐతో కూడా విచారణ చేయాలని డిమాండ్ చేసారు.. ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైందని, నామా ఎంపీగా గెలిచే అవకాశం ఉందన్నారు.. అలాగే ఎంపీగా బరిలో ఉన్న నామా సైతం ప్రభుత్వంపై మండిపడ్డారు..

కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తీసుకొని వచ్చిందని విమర్శించిన ఆయన.. అమలు కానీ హామిలు ఇచ్చి ఇప్పుడు సాధ్యం కాదంటూ చేతులు ఎత్తేసిందని తెలిపారు. మొదటి విడతలో అన్ని మండలాలలో సమావేశాలు పూర్తిచేశామని తెలిపిన నామా.. అనేక సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్నారని.. అందుకే తెలంగాణ గొంతుకను పార్లమెంట్ లో వినిపించాలంటే అది బీఆర్ఎస్ కే సాధ్యమన్నారు..

You may also like

Leave a Comment