కేంద్రంలో మరోసారి మోడీ (Modi) ప్రధానిగా ఉంటారనే ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ (BJP) నేతలు.. ఆ దిశగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.. అలాగే కేంద్ర ప్రభుత్వ హయాంలో దేశంలో జరిగిన మార్పులపై వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు ఎంపీ కె.లక్ష్మణ్ (K.Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు.. కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుతో ప్రశాంతంగా ఉందని తెలిపారు.

అంబేద్కర్ ను గౌరవించి భారత రత్న ఇచ్చిన ఘనత బీజేపీదని తెలిపిన లక్ష్మణ్.. ఆయన రాజ్యాంగాన్ని అవమానరిచి తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.. విభజించు పాలించు విధానం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందని విమర్శించారు.. అందుకే హిందూ సమాజంపై విషం జిమ్ముతున్నారని ఆరోపించారు.. కాంగ్రెస్ సనాతన ధర్మం వినాశనం కోరుకునే పార్టీ అని మండిపడ్డారు..
కాంగ్రెస్ కూటమి CAA పట్ల విష ప్రచారం చేస్తోందని.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370 మళ్ళీ తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని తెలిపారు. అలాగే రంగనాథన్ సిఫార్సులను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతోందని లక్ష్మణ్ మండిపడ్డారు. వారసత్వ సంపద పిల్లలకు చెందాలంటే యాభై శాతం సంపద ప్రభుత్వానికి చెల్లించాలని శ్యాం పిట్రోడ్ చెప్పడం ఆ పార్టీ చెడు ఆలోచనలు గమనించాలని సూచించారు..