Telugu News » BRS : ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకొంటున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

BRS : ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకొంటున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మన దేశంలో ప్రాంతీయ పార్టీలే గెలవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు వెల్లడించారు.

by Venu
ktrs open letter to cm revanth reddy

కమ్యూనిస్టులతో కాంగ్రెస్ (Congress) పొత్తు కన్ఫామ్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. వీటిపై కేటీఆర్ (KTR) స్పందించారు.. కేరళ (Kerala)లో సీపీఎం (CPM)ను రాహుల్ గాంధీ తిడుతున్నారు..కానీ దేశంలో మిగతా ప్రాంతాల్లో కమ్యూనిస్టులతో పొత్తులు ఏర్పరచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.. అలాగే కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ను రేవంత్ రెడ్డి (Revanth Reddy) బండ బూతులు తిట్టారు.

KTRఅయినా ఇక్కడి సీపీఎం నేతలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం చూస్తుంటే.. విలువలను బజార్లో వదిలేసినట్లే అని అర్థం అవుతోందని విమర్శించారు.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీతో రాజీ పడిందని సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మన దేశంలో ప్రాంతీయ పార్టీలే గెలవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు వెల్లడించారు.

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని ఆరోపించిన కేటీఆర్.. బీజేపీతో కొట్లాటే సత్తా కాంగ్రెస్ కి లేదన్నారు.. అందుకే ప్రాంతీయ పార్టీలు గెలిస్తే పట్టు ఉంటుందని పేర్కొన్నారు.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలుస్తున్నారని.. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ గెలవాలని, తమిళనాడులో స్టాలిన్ గెలవాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. దేశంలో ప్రాంతీయ పార్టీలే బీజేపీకి అడ్డుకట్ట వేస్తున్నాయన్నారు.

బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించిన కేటీఆర్.. ఈసారీ దేశంలో 200ల సీట్లు కూడా దాటవని పేర్కొన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 10 నుంచి 12 స్థానాలు గెలిపిస్తే.. దేశ, రాష్ట్ర రాజకీయాలు శాసించే స్థాయిలో ఉంటామని వివరించారు. మరోవైపు మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు పోటీ చేస్తున్న స్థానాల్లో ఫోకస్ పెడతామని పార్టీ మారిన వారికి ఇన్ డైరెక్ట్ గా హెచ్చరించారు..

You may also like

Leave a Comment