Telugu News » BJP : ఇది భయపెట్టే ప్రభుత్వం కాదు.. భరోసా ఇచ్చే ప్రభుత్వం.. ప్రధాని మోడీ..!

BJP : ఇది భయపెట్టే ప్రభుత్వం కాదు.. భరోసా ఇచ్చే ప్రభుత్వం.. ప్రధాని మోడీ..!

కాంగ్రెస్ తర్వాత కమ్యునిస్టులు ఈ రాష్ట్రాన్ని మరింత నాశనం చేశారని విమర్శించారు.. మరోవైపు దేశంలో 3 కోట్ల నూతన గృహాలు నిర్మించబోతున్నామని తెలిపారు..

by Venu
Prime Minister Modi's key comments on Hinduism.. Strong warning to those parties!

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (Congress)పై ప్రధాని మోడీ (PM Modi) విమర్శల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని ఎద్దేవా చేసిన ఆయన.. ఆ పార్టీ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్..అంటే దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. త్రిపుర (Tripura)లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు..

PM Modi: Those who oppose the Constitution will be punished in this election.. Prime Minister Modi's interesting comments..!మరోవైపు తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని తెలిపిన ప్రధాని.. చెప్పింది చేస్తాం.. చేసేది చెప్తాం అని తెలిపారు.. గతంలో త్రిపురలో మొబైల్ టవర్స్ సరిగా పనిచేసేవి కాదని గుర్తుచేసిన మోడీ.. ఇప్పుడు రాష్ట్రంలో 5జీ నెట్ వర్క్ చక్కగా వస్తుందని వివరించారు. నాణ్యమైన నెట్ వర్క్ అందిస్తూ.. నెలకు మొబైల్ బిల్ అందుబాటులో ఉండేలా చూస్తున్నామని అన్నారు..

ఎంత నెట్ వాడినప్పటికీ నెలకు రూ.400 నుంచి రూ.500 వరకు బిల్ వస్తుందని వివరించారు. ఇలాంటి ఉత్తమ నెట్ ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఛార్జీ చేసేదన్నారు.. అలాగే ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ అవినీతి మయం చేసిందని ప్రధాని ధ్వజమెత్తారు.. ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఆ పార్టీ ఆలోచించలేదని ఆరోపించారు..

కాంగ్రెస్ తర్వాత కమ్యునిస్టులు ఈ రాష్ట్రాన్ని మరింత నాశనం చేశారని విమర్శించారు.. మరోవైపు దేశంలో 3 కోట్ల నూతన గృహాలు నిర్మించబోతున్నామని తెలిపిన మోడీ.. త్రిపురలో ఉన్న పేద ప్రజలకు అందులో భాగస్వామ్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల కోసమే బీజేపీ (BJP) ఆలోచిస్తుందని పేర్కొన్నారు.. ఇది భయపెట్టే ప్రభుత్వం కాదని.. భరోసా ఇచ్చే ప్రభుత్వమని తెలిపారు..

You may also like

Leave a Comment