Telugu News » UNSC: మాస్క్ ప్రతిపాదన.. ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం..!

UNSC: మాస్క్ ప్రతిపాదన.. ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం..!

ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇంతవరకు లేదు. ఇందుకు చర్యలు తీసుకుంటామని ఇటీవల విడుదలైన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ (BJP)  హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

by Mano
UNSC: Mask proposal.. India's permanent membership in the UN..!

భద్రతా మండలి(UNSC)లో మొత్తం 15దేశాలకు సభ్యత్వం ఉంటుంది. వీటిలో చైనా, యూకే, ఫ్రాన్స్, రష్యా, అమెరికాకు శాశ్వత సభ్యత్వం పేరిట వీటో అధికారం ఉంది. మరో పదిదేశాలు రెండేళ్ల కాలపరిమితితో తాత్కాలిక సభ్యదేశాలుగా ఎన్నికవుతూ ఉంటాయి. అయితే,  ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇంతవరకు లేదు. ఇందుకు చర్యలు తీసుకుంటామని ఇటీవల విడుదలైన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ (BJP)  హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

UNSC: Mask proposal.. India's permanent membership in the UN..!

మరోవైపు యూఎన్ఎస్సీలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల ప్రస్తావించారు. ఐరాసలో ప్రాతినిధ్యం 21 శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని ఎలాన్ మస్క్ (Elon Musk) జనవరిలో ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

అత్యధిక జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం లేకపోవడానికి తప్పుబట్టారు. ఆఫ్రికా దేశాలన్నింటికీ కలిపి కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వర్ధమాన దేశాల ప్రయోజనాలు కాపాడేందుకు సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిన అవసరం పునరుద్ఘాటించారు. దీనిపై అగ్రరాజ్యం అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు.

భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం స్పష్టం చేసింది. ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్ గతంలో సర్వప్రతినిధి సభలో మాట్లాడారు. విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చారు. భద్రతా మండలి సహా ఐరాస సంస్థల్లో సంస్కరణలకు మేం ఎప్పుడూ అనుకూలమేనని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment