Telugu News » BJP Tweet: గొర్రెల పంపిణీ స్కీంలో భారీ అవకతవకలు.. బీజేపీ ట్వీట్ వైరల్..!

BJP Tweet: గొర్రెల పంపిణీ స్కీంలో భారీ అవకతవకలు.. బీజేపీ ట్వీట్ వైరల్..!

టీ-బీజేపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో సెటైరికల్ ట్వీట్ చేసింది. కేసీఆర్‌ ఒకే బైక్‌పై గొర్రెల మందను తీసుకెళ్తున్నట్లు ఓ కార్టూన్‌ను పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.

by Mano
BJP Tweet: Massive irregularities in the sheep distribution scheme.. BJP's tweet goes viral..!

బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS Government) హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై కాగ్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. బైక్, కారు, బస్సు, అంబులెన్స్‌లో గొర్రెల రవాణా చేయడంతోపాటు గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు చూపించినట్లు తేల్చింది. తాజాగా, ఈ అంశంపై టీ-బీజేపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో సెటైరికల్ ట్వీట్ చేసింది.

BJP Tweet: Massive irregularities in the sheep distribution scheme.. BJP's tweet goes viral..!

కేసీఆర్‌ ఒకే బైక్‌పై గొర్రెల మందను తీసుకెళ్తున్నట్లు ఓ కార్టూన్‌ను పోస్ట్ చేశారు. ‘’గొర్రెల పంపిణీ పేరు మీద.. అంబలి చూపి గొంగడి మాయం చేసిండు. కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు బయటపడ్డాయి. బైక్‌పై ఒకే సారి 126గొర్రెలను తరలించినట్లు రికార్డులలో ఎక్కించి స్కాంకి పాల్పడ్డ గత ప్రభుత్వం!!’ #KCRLootedTelangana’’ అంటూ బీజేపీ పేర్కొంది.

ప్రస్తుతం బీజేపీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఇటీవల విడుదలైన కాగ్ నివేదికలో గొర్రెల పంపిణీపై విస్తుపోయే విషయాలను వెల్లడించింది. మృతిచెందిన వారి పేరిట గొర్రెలను పంపిణీ చేసినట్లు నమోదు చేయడంతో పాటు, నకిలీ రవాణా ఇన్వాయిస్‌లతో రూ.68 కోట్లు స్వాహా చేశారని కాగ్ నివేదిక తేల్చింది.

గొర్రెలకు నకిలీ ట్యాగ్‌లతో మరో 92 కోట్ల అవినీతి జరిగిందని, గొర్రెల పంపిణీలో 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బైక్ పై 126 గొర్రెలు, కారులో 168, అంబులెన్స్ 84, ఆటోలో 126 తరలించినట్లు రికార్డుల్లో చూపారని పేర్కొంది.

You may also like

Leave a Comment