Telugu News » Breaking: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు..!

Breaking: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు..!

ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ఇంట్లో ఈడీ(ED) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ఈడీ(ED) అధికారులతో కలిసి ఐటీ(IT) ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

by Mano
Breaking: IT searches at MLC Kavitha's house..!

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ఇంట్లో ఈడీ(ED) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ఈడీ(ED) అధికారులతో కలిసి ఐటీ(IT) ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Breaking: IT searches at MLC Kavitha's house..!

నాలుగు టీమ్‌లుగా ఏర్పడి అధికారులు తనిఖీలు చేపట్టారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఛార్జిషీటులో నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ సమన్లు పంపిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అందులో తెలిపారు. కవిత పిటిషన్​పై గత కొద్ది నెలలుగా సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం కవిత వ్యాజ్యంపై విచారణ చేపట్టి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేయడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

You may also like

Leave a Comment