పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ (BRS) కమీషన్లకు కక్కుర్తి పడి కృష్ణా జలాల్లో తెలంగాణ (Telanagana) వాటాను అక్రమంగా ఏపీకి దోచిపెట్టిన నేతలు కూడా నీటి జలాల పంపిణీపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB)కి సాగునీటి ప్రాజెక్టులు అప్పగించడంతోపాటు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై బీఆర్‌ఎస్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించదని అంటున్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పొందుపరిచిన తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల నీటిని మాజీ సీఎం కేసీఆర్ (KCR) అంగీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. 2014 నుంచి జరిగిన వివిధ సమావేశాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అంగీకరిస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంతకం చేసిందని కేంద్రం సైతం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే..
ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (RLIS) 8 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను నిర్మించడం ప్రారంభించినప్పుడు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కన్నెత్తి చూడలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.. ప్రతిరోజు 12 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఏపీ ప్రణాళికలు సిద్ధం చేస్తే, తెలంగాణలోని మన ప్రాజెక్టులు 2 టీఎంసీలు కూడా డ్రా చేయలేవని అంటున్నారు..
గతంలో కేసీఆర్, వైఎస్ జగన్ (YS Jagan) మధ్య హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన భేటీ సందర్భంగా ఆర్‌ఎల్‌ఐఎస్‌పై ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. తెలంగాణ భూభాగంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి ఏపీ పోలీసులు ప్రవేశించినప్పటికీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని, చివరకు ప్రాజెక్టుకు సీఆర్‌పీఎఫ్ రక్షణ కల్పిస్తోందని విమర్శలు ఎదురవుతున్నాయి.
మొత్తానికి ఎన్నికల వేళ కేసీఆర్ మరోసారి జగన్ కు సపోర్ట్ గా మాట్లాడటం సంచలనంగా మారింది.. ఇద్దరు కలిసి నీటి దోపిడి చేశారనే ప్రచారం తెరమీదికి రావడం ఆసక్తి కలిగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కొత్త డ్రామాకు తెరతీస్తే.. ఇప్పుడు మిత్రుడు జగన్ కోసం గులాబీ బాస్ కొత్త రాగం అందుకోవడం ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి..