అప్పు పేరు వినబడగానే ఆమడ దూరం పరిగెత్తే గరీబు బతుకులు రాష్ట్ర ప్రభుత్వం తెగిన ఆనకట్టలా చేస్తున్న అప్పులను చూస్తుంటే జీర్ణించుకో లేక పోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అసలు నేతల మాటలకు అర్థాలు తెలియవు కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా అధికార పార్టీ మార్చిందని నిరసనలు కూడా చేస్తున్నారు కొందరు.. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారాల్లో ఓటర్ల మైండ్ లోకి నెగెటివ్ ఆలోచనలు వెళ్ళకుండా బాగానే కవర్ చేస్తున్నారు నేతలని, పొద్దుగడవని పెద్దయ్యలు రచ్చబండ దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటున్నారట.
అయితే రాష్ట్ర అప్పుల విషయంలో క్లారిటీ ఇచ్చారు ఐటీ (IT)శాఖ మంత్రి కేటీఆర్ (KTR).. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన మీట్ ది ప్రెస్లో మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ (Telangana)రాష్ట్ర వృద్ధిరేటు ఐదో స్థానంలో ఉందని అన్నారు.. ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదన్న కేటీఆర్ సంపద సృష్టించడం కోసమే రుణాలు తీసుకువచ్చామని పేర్కొన్నారు.
తీసుకున్న అప్పులను సాగునీటి రంగం, మిషన్ భగీరథకు ఉపయోగించామని కేటీఆర్ వెల్లడించారు. ఇది తెలియని కొంత మంది నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపణలు చేయడం సరికాదని బదులిచ్చారు. మరోవైపు బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress) పార్టీలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు..ఒక సందర్భంలో రేవంత్రెడ్డి, సోనియాగాంధీ బలిదేవత అన్నారని గుర్తు చేశారు.. ఆ బలిదేవత తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఇచ్చిందని విమర్శించారు.
ఎలాగూ ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలింది. కనీసం తెలంగాణలో అయిన నాలుగు సీట్లు రాబట్టుకుని పరువు కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని ఎద్దేవా చేశారు.. మరోవైపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఏమైంది?. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న హామీ ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్.. ఇక మంత్రి మాటలు విన్న సామాన్యుడు.. నిజమే మరి అధికార పార్టీ చేసిన అప్పులతో ఎవరు బాగుపడ్డారో రాష్ట్రం అంతా కోడై కూస్తుందని.. జనం గుసగుసలు పెట్టుకుంటున్నారని అంటున్నాడు..