Telugu News » KCR : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. ఏడు స్థానాల్లో మార్పులు.. మొత్తం లిస్ట్ ఇదే!

KCR : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. ఏడు స్థానాల్లో మార్పులు.. మొత్తం లిస్ట్ ఇదే!

అనూహ్యంగా ఈసారి కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డిలోనూ ఆయన పోటీ చేయనున్నారు.

by admin
BRS MLA Candidates List Release

వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించారు. తెలంగాణ భవన్‌ లో అధికారికంగా జాబితాను విడుదల చేశారు. పెద్దగా మార్పులు లేవవని.. గతంలో మాదిరిగానే ఏడు చోట్ల చేశామని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఎంతో ఉత్తమమైన వ్యక్తి అయినా కూడా.. ఆయన పౌరసత్వంపై వివాదం కొనసాగుతోందన్నారు. పార్టీకి ఇష్టం లేకపోయినా ఆ స్థానంలో మార్పు చేశామని తెలిపారు.

BRS MLA Candidates List Release

మొత్తం 115 మంది సభ్యులతో కూడిన జాబితాలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు దక్కాయి. అయితే.. వేములవాడతో పాటు మెట్‌ పల్లి, ఉప్పల్‌ సిట్టింగ్‌ అభ్యర్థులను మారుస్తున్నామన్నారు కేసీఆర్. అలాగే, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, వైరా నియోజకవర్గాల్లోనూ సిట్టింగులకు షాకిచ్చారు. అనూహ్యంగా ఈసారి కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డిలోనూ ఆయన పోటీ చేయనున్నారు.

మార్పులు జరిగిన స్థానాల్లో సిట్టింగులకు బదులుగా కొత్త వ్యక్తులకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఒకవైపు ఇంటెలిజెన్స్ విభాగం అందించిన ఇన్‌ పుట్స్, మరోవైపు సొంతంగా చేయించుకున్న సర్వేల ఆధారంగా సుదీర్ఘంగా కసరత్తులు చేసిన కేసీఆర్.. ఈ ఫస్ట్ లిస్టును రూపొందించారు. మిగిలిన వారి లిస్టును కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్

సిర్పూర్ : కొనేరు కోనప్ప
చెన్నూరు : బాల్క సుమన్
బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య
మంచిర్యాల : దివాకర్ రావు
ఆసిఫాబాద్ : కోవ లక్ష్మి
ఖానాపూర్ : జాన్సన్ నాయక్
ఆదిలాబాద్ : జోగు రామన్న
బోథ్ : అనిల్ జాదవ్
నిర్మల్ : ఇంద్రకరణ్ రెడ్డి
ముధోల్ : విఠల్ రెడ్డి
ఆర్మూరు : జీవన్ రెడ్డి
బోధన్ : షకీల్ అహ్మద్
జుక్కల్ : హన్మంత్ షిండే
బాన్సువాడ : పోచారం శ్రీనివాసరెడ్డి
ఎల్లారెడ్డి : జాజల సురేందర్
కామారెడ్డి : కేసీఆర్
నిజామాబాద్ అర్బన్ : బిగాల గణేశ్ గుప్త
నిజామాబాద్ రూరల్ : బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ : వేముల ప్రశాంత్ రెడ్డి
కోరుట్ల : కల్వకుంట సంజయ్
జగిత్యాల : డాక్టర్ సంజయ్ కుమార్
ధర్మపురి : కొప్పుల ఈశ్వర్
రామగుండం : కొరుకంటి చందర్
మంథని : పుట్ట మధు
పెద్దపల్లి : దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్ : గంగుల కమలాకర్
చొప్పదండి : సుంకే రవిశంకర్
వేములవాడ : లక్ష్మీ నరసింహారావు
సిరిసిల్ల : కేటీఆర్
మానకొండూరు : రసమయి బాలకిషన్
హుజూరాబాద్ : పాడి కౌశిక్ రెడ్డి
హుస్నాబాద్ : ఒడితెల సతీష్ బాబు
సిద్దిపేట : హరీశ్‌ రావు
మెదక్ : పద్మా దేవేందర్ రెడ్డి
నారాయణఖేడ్ : భూపాల్‌ రెడ్డి
ఆంధోల్ : క్రాంతి కిరణ్
నర్సాపూర్ : పెండింగ్
జహీరాబాద్ : మాణిక్ రావు
సంగారెడ్డి : చింతా ప్రభాకర్
పటాన్‌ చెరు : గూడెం మహిపాల్ రెడ్డి
దుబ్బాక : కొత్త ప్రబాకర్ రెడ్డి
గజ్వేల్ : కేసీఆర్
మేడ్చల్ : మల్లారెడ్డి
మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ : కేపీ వివేకానంద గౌడ్
కూకట్‌పల్లి : మాధవరం కృష్ణారావు
ఉప్పల్ : బండారి లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం : మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బీ నగర్ : సుధీర్ రెడ్డి
మహేశ్వరం : సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్రనగర్ : ప్రకాశ్ గౌడ్
శేరిలింగంపల్లి : అరికెపూడి గాంధీ
చేవెళ్ళ : కాలె యాదయ్య
పరిగి : మహేశ్ రెడ్డి
వికారాబాద్ : మెతుకు ఆనంద్
తాండూరు : పైలట్ రోహిత్ రెడ్డి
ముషీరాబాద్ : ముఠాగోపాల్
మలక్‌ పేట్ : తీగల అజిత్ రెడ్డి
అంబర్‌ పేట్ : కాలేరు వెంకటేశ్
ఖైరతాబాద్ : దానం నాగేందర్
జూబ్లీహిల్స్ : మాగంటి గోపీనాధ్
సనత్ నగర్ : తలసాని శ్రీనివాస్
నాంపల్లి : పెండింగ్
కార్వాన్ : అయందల కృష్ణయ్య
గోషామహల్ : పెండింగ్
చార్మినార్ : ఇబ్రహీం లోడి
చాంద్రాయణ్‌ గుట్ట : సీతారాం రెడ్డి
యాకుత్‌ పురా : సామ సుందర్ రెడ్డి
బహదూర్‌ పురా : అలీ బక్రీ
సికింద్రాబాద్ : పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ : లాస్య నందిత
కొడంగల్ : పట్నం నరేందర్ రెడ్డి
నారాయణ్‌పేట్ : రాజేందర్ రెడ్డి
మహబూబ్‌ నగర్ : శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల : లక్ష్మారెడ్డి
దేవరకద్ర : ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి
మక్తల్ : చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి : నిరంజన్ రెడ్డి
గద్వాల్ : కృష్ణమోహన్ రెడ్డి
ఆలంపూర్ : అబ్రహం
నాగర్‌ కర్నూల్ : మర్రి జనార్ధన్ రెడ్డి
అచ్చంపేట్ : గువ్వల బాలరాజు
కల్వకుర్తి : జైపాల్ యాదవ్
షాద్‌ నగర్ : అంజయ్య యాదవ్
కొల్లాపూర్ : బీరం హర్షవర్ధన్ రెడ్డి
దేవరకొండ : రవీంద్రకుమార్ నాయక్
నాగార్జునసాగర్ : నోముల భగత్
మిర్యాలగూడ : నల్లమోతు భాస్కరరావు
హుజూర్‌ నగర్ : సైదిరెడ్డి
కోదాడ : బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట : జగదీశ్ రెడ్డి
నల్లగొండ : కంచర్ల భూపాల్‌ రెడ్డి
మునుగోడు : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
భువనగిరి : పైళ్ళ శేఖర్ రెడ్డి
నకిరేకల్ : చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి : గాదరి కిషోర్
ఆలేరు : గొంగిడి సునితారెడ్డి
జనగామ : పెండింగ్
స్టేషన్ ఘన్‌ పూర్ : కడియం శ్రీహరి
పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్ రావు
డోర్నకల్ : రెడ్యానాయక్
మహబూబాబాద్ : శంకర్ నాయక్
నర్సంపేట్ : పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల : చల్లా ధర్మారెడ్డి
వరంగల్ వెస్ట్ : దాస్యం వినయభాస్కర్
వరంగల్ ఈస్ట్ : నన్నపనేని నరేందర్
వర్ధన్నపేట : ఆరూరి రమేశ్
భూపాలపల్లి : గండ్ర వెంకటరమణారెడ్డి
ములుగు : బడే నాగజ్యోతి
పినపాక : రేగా కాంతారావు
ఇల్లెందు : హరిప్రియ నాయక్
ఖమ్మం : పువ్వాడ అజయ్ కుమార్
పాలేరు : ఉపేందర్ రెడ్డి
మధిర : లింగాల కమల్‌రాజ్
వైరా : మదన్ లాల్
సత్తుపల్లి : సండ్ర వెంకటవీరయ్య
కొత్తగూడెం : వనమా వెంకటేశ్వరరావు
అశ్వారావుపేట : మెచ్చా నాగేశ్వరరావు
భద్రాచలం : తెల్లం వెంకట్రావు

You may also like

Leave a Comment