Telugu News » Nation in Newyork : న్యూయార్క్ ‘ఇండియా డే పరేడ్’ లో సమంత సందడి..!`

Nation in Newyork : న్యూయార్క్ ‘ఇండియా డే పరేడ్’ లో సమంత సందడి..!`

అమెరికా(America)లోని న్యూయార్క్ లో అట్టహాసంగా జరుగిన ‘ఇండియా డే పరేడ్(India Day Parade)’ లో శకటాలు సినీతారలతో ముద్దులొలికాయి.

by sai krishna

అమెరికా(America)లోని న్యూయార్క్ లో అట్టహాసంగా జరిగిన ‘ఇండియా డే పరేడ్(India Day Parade)’ లో శకటాలు  సినీ తారలతో ముద్దులొలికాయి. ఈ ఈవెంట్ లో సౌత్ ఇండియన్(South Indian) స్టార్ హీరోయిన్ సమంత(Samantha)తోపాటు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) సందడి చేశారు.

అలాగే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపకర్త ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ సైతం పాల్గొన్నారు. వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన శకటాలపై నిలబడిన జాక్వెలిన్ జాతీయ జెండాను ఊపుతూ కనిపించారు. న్యూయార్క్(New York)వీధుల్లో తిరుగుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు సామ్.   తనకు ఈ అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ మురిసిపోయారు. సామ్ మాట్లాడుతూ.. “ఈ రోజు ఇక్కడ ఉండటం నిజంగా నాకు గర్వకారణంగా ఉంది.

 

నా సంస్కృతి, వారసత్వం ఎంత గొప్పదో మీరు నాకు అర్థమయ్యేలా చేశారు.   నేను చూసిన ప్రతి విషయం నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఇంతవరకు ఇచ్చిన సపోర్ట్ కు అందరికీ థ్యాంక్స్. నా ప్రతి సినిమాను ఆదరిస్తున్నందుకు అమెరికాకు ధన్యవాదాలు. సెప్టెంబర్ 1న ‘ఖుషి’ని చూడండి. ఐ లవ్ యూ. ధన్యవాదాలు” అని తెలిపారు.

 

సామ్, జాక్వెలిన్ కాదు గతంలో అనేక మంది సెలబ్రెటీలు ఈ పరేడ్ కు హాజరై మెరిశారు. అందులో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, అభిషేక్ బచ్చన్, సన్నీ డియోల్, రవీనా టాండన్‌ లతో పాటు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించి అభిమానులను అలరించారు.  .

You may also like

Leave a Comment