బీఆర్ఎస్ (brs) లో ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారింది ఎవరైనా ఉన్నారంటే అది మైనంపల్లి హనుమంత రావే(mynampalli). గత కొన్ని రోజుల నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కెట్లు ప్రకటించినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతల్లో కొందరు అసంతృప్తిగా ఉన్నప్పటికీ కొందరూ బయటపడకుండా ఉన్నారు. కానీ కొందరు బాహటంగానే చెబుతున్నారు.వారిలో మల్కాజ్ గిరి టికెట్ పొందిన మైనంపల్లి ఒకరు.
తన కొడుకుకి మెదక్ ఎమ్మెల్యే టికెట్ రాలేదని తీవ్ర అంసతృప్తితో ఉండటమే కాకుండా..ఆ టికెట్ రాకుండా మంత్రి హరీశ్ రావు అడ్డుపడుతున్నారని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఆ కామెంట్స్ పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో ఆయన పై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని భావించారు.
కానీ పార్టీ పెద్దల నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఆయన మీద చర్యలు తీసుకోలేదు.మైనంపల్లి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయనను కానీ బయటకు పంపిస్తే ఆ ప్రభావం రానున్న రోజుల్లో పార్టీ మీద ఉంటుందనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
మల్కాజ్ గిరి టికెట్ ను ఇచ్చిన్నప్పటికీ మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు , కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మైనంపల్లిని బుజ్జగించేందుకు సీఎం ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
సదరు నేత పై మైనంపల్లికి మంచి గురి ఉంది. దీంతో ఆ నేత రంగంలోకి దిగితే అయినా మైనపంల్లి పార్టీని వీడే ఆలోచన మార్చుకుంటారేమో చూడాలి.