Telugu News » VH : బీఆర్‌ఎస్‌ అధికారం లేకపోతే ఆగలేక పోతుంది.. అందుకే 420 బుక్‌లెట్‌తో బద్నామ్ చేస్తుంది..!!

VH : బీఆర్‌ఎస్‌ అధికారం లేకపోతే ఆగలేక పోతుంది.. అందుకే 420 బుక్‌లెట్‌తో బద్నామ్ చేస్తుంది..!!

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులకు ముడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం అని చెప్పి.. ఎకరాలకు ఎకరాలు దోచుకొని.. మనిషికో ఉద్యోగం ఇచ్చుకొన్న కల్వకుంట్ల కుటుంబం.. అధికారం లేకపోతే ఆగలేక పోతుందని హనుమంతరావు ఆరోపణలు చేశారు..

by Venu

తెలంగాణ (Telangana)లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై (Congress) బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మోసపూరితంగా ఉన్నాయని ఆరోపణలు చేస్తున్న గులాబీ నేతలు.. ‘కాంగ్రెస్ 420’ హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసి.. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలేది లేదని తెలిపిన సంగతి తెలిసిందే..

అయితే బీఆర్ఎస్ నేతల తీరుపై.. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V.Hanumanth Rao) మండిపడ్డారు.. బీఆర్ఎస్ నేతలకు పనిలేక 420 బుక్ లెట్‌తో కాంగ్రెస్ ని బద్నామ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి కవరింగ్ ఇస్తున్నారని విమర్శించారు.. పదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు..

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఖాయమని.. వీటివల్ల కాంగ్రెస్ కు మంచిపేరు వస్తుందనే అక్కసుతో ఆరోపణలు చేస్తున్నారని.. బీఆర్ఎస్, బీజేపీలపై మండిపడ్డారు.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులకు ముడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం అని చెప్పి.. ఎకరాలకు ఎకరాలు దోచుకొని.. మనిషికో ఉద్యోగం ఇచ్చుకొన్న కల్వకుంట్ల కుటుంబం.. అధికారం లేకపోతే ఆగలేక పోతుందని హనుమంతరావు ఆరోపణలు చేశారు.. రైతులకు ఎరువులు ఫ్రీ అని అరచిన గొంతు.. ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు..

మరోవైపు సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందని హనుమంతరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తానని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తామని.. ఇండియా కూటమిని గెలిపించుకుంటామని వీహెచ్ స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment