Telugu News » Bull In Bank: ఎస్‌బీఐ బ్యాంకులో ఎద్దు హల్‌చల్.. వీడియో వైరల్..!

Bull In Bank: ఎస్‌బీఐ బ్యాంకులో ఎద్దు హల్‌చల్.. వీడియో వైరల్..!

ఓ ఎద్దు(Bull) ఏకంగా బ్యాంకు(Bank)లోకి వెళ్లి హల్‌చల్ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లోని ఉన్నావ్‌(Unnao)లో చోటుచేసుకుంది.

by Mano
Bull In Bank: Bull in SBI Bank.. Video Viral..!

ఓ ఎద్దు(Bull) ఏకంగా బ్యాంకు(Bank)లోకి వెళ్లి హల్‌చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎద్దు బ్యాంకులోకి రాగానే లోపల ఉన్న వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. బ్యాంకు లోపల ఎద్దు కనిపించడంతో అక్కడ గందరగోళం నెలకొంది.

Bull In Bank: Bull in SBI Bank.. Video Viral..!

ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లోని ఉన్నావ్‌(Unnao)లో చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన అందరూ లైకుల వర్షం కురిపిస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఉన్నావ్‌లోని కొత్వాలి బడా కుడాలి వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోకి బుధవారం మధ్యాహ్నం ఓ ఎద్దు ప్రవేశించింది.

షాహ్ంజ్ ఎస్బీఐ బ్యాంకు తలుపులు తెరిచి ఉండగా చలికి తట్టుకోక ఓ ఎద్దు లోపలికి వచ్చింది. ఎద్దును చూసిన బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు పరుగులు తీశారు. బ్యాంకులోకి వచ్చిన ఎద్దు కాసేపు నిలబడింది. అది ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు.

అయితే, కాసేపటికి సెక్యూరిటీ గార్డు వచ్చి ఎద్దును బ్యాంకు నుంచి బయటికి తీసుకెళ్లారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment