Telugu News » Accident in Shooting: షూటింగ్‌లో ప్రమాదం.. యంగ్ హీరోకు గాయాలు..!

Accident in Shooting: షూటింగ్‌లో ప్రమాదం.. యంగ్ హీరోకు గాయాలు..!

మారేడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో నితిన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో హీరో నితిన్‌ చేయికి పెద్దగాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌ను నిలిపివేశారట.

by Mano
Accident in Shooting: Accident in shooting.. Young hero injured..!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌(Hero Nithin)కు గాయాలయ్యాయి. షూటింగ్ సమయంలో ఆయన చేతికి పెద్ద గాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ‘తమ్ముడు’(Thammudu) టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. వేణుశ్రీరామ్(Venu Sriram) డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేంగంగా సాగుతోంది.

Accident in Shooting: Accident in shooting.. Young hero injured..!

మారేడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో నితిన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే, ఈషూటింగ్‌లో భారీ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది చిత్రయూనిట్. అయితే ‌ఈ షూటింగ్‌లో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ క్రమంలో నితిన్‌ చేయికి పెద్దగాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌ను నిలిపివేశారట. అంతేకాదు.. నితిన్‌ మూడువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. దాంతో ఈమూవీ షూటింగ్ పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది.

నితిన్ ఇటీవల నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. కొద్ది రోజులుగా మంచి హిట్ పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నితిన్.. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత చాలా కాలానికి దిల్ రాజు బ్యానర్‌లో ‘తమ్ముడు’ అనే సినిమాను చేస్తున్నాడు.

 

You may also like

Leave a Comment