భూమిపై అనేక కోట్ల జీవరాశులు నివాసముంటున్నాయి. ఇప్పటికే ఎన్నో జీవులు అంతరించిపోగా, మరికొన్ని అంతరించి పోయే దశలో ఉన్నాయి. ఇప్పటికీ మనుషులకు తెలియని ఎన్నో జీవులు భూమిపై ఉన్నాయి. కొన్నిసార్లు అరుదైన జంతువులు, పక్షులు, కీటకాలు కనిపిస్తూ ఉంటాయి.
తాజాగా ఓ అరుదైన సీతాకోక చిలుకకు(Rare Butterfly) సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు(IAS Supriya Sahu) షేర్ చేస్తూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు. ఇప్పటివరకు ఈ వైరల్ ఫొటోను 43.6 వేల మంది వీక్షించారు.
తమిళనాడులోని మెగామలైలోని శ్రీవిలిపుత్తూరు టైగర్ రిజర్వ్‌లో ఈ కొత్త జాతి సీతాకోకచిలుకను పరిశోధకులు కనుగొన్నారు. ఈ సీతాకోక చిలుక పూర్తి నీలం రంగుతో ఆకట్టుకునేలా ఉంది. దీంతో పశ్చిమ కనుమల్లో 33ఏళ్ల తర్వాత ఇలాంటి కొత్త జాతి సీతాకోకచిలుకను గుర్తించినట్లు సుప్రియ పేర్కొన్నారు.
ఈ సీతాకోక చిలుకకు సిగరిటిస్ మేఘమలైయెన్సిస్ అని పేరు పెట్టారు ఐఏఎస్ సుప్రియ. ఈ ఆవిష్కరణతో పశ్చిమ కనుమల్లో కనబడుతున్న సీతాకోక చిలుకల జాతుల సంఖ్య 337కు చేరిందని తెలిపారు. ` ఇవి ఎవరికైనా కనిపించినా, కలలోకి వచ్చినా మంచి జరుగుతుందని నమ్ముతారు` అని ఓ నెటిజన్ తెలిపారు.
There is a new kid on the block and its a Blue Butterfly 🦋 – Reserachers in Tamil Nadu's Sriviliputhur Tiger Reserve in Megamalai have discovered a new species of Silverline butterfly namely 'Cigaritis meghamalaiensis' Dr. Kalesh Sadasivam,Thiru Ramasamy Kamaya and Dr.C.P.… pic.twitter.com/HuoYdJjTaR
— Supriya Sahu IAS (@supriyasahuias) January 13, 2024