Telugu News » Butterfly: అరుదైన సీతాకోక చిలుక.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఐఏఎస్ అధికారి..!

Butterfly: అరుదైన సీతాకోక చిలుక.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఐఏఎస్ అధికారి..!

ఓ అరుదైన సీతాకోక చిలుకకు(Rare Butterfly) సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు(IAS Supriya Sahu) షేర్ చేస్తూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు.

by Mano
Butterfly: A rare butterfly.. shared by an IAS officer on social media..!

భూమిపై అనేక కోట్ల జీవరాశులు నివాసముంటున్నాయి. ఇప్పటికే ఎన్నో జీవులు అంతరించిపోగా, మరికొన్ని అంతరించి పోయే దశలో ఉన్నాయి. ఇప్పటికీ మనుషులకు తెలియని ఎన్నో జీవులు భూమిపై ఉన్నాయి. కొన్నిసార్లు అరుదైన జంతువులు, పక్షులు, కీటకాలు కనిపిస్తూ ఉంటాయి.

Butterfly: A rare butterfly.. shared by an IAS officer on social media..!

తాజాగా ఓ అరుదైన సీతాకోక చిలుకకు(Rare Butterfly) సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు(IAS Supriya Sahu) షేర్ చేస్తూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు. ఇప్పటివరకు ఈ వైరల్ ఫొటోను 43.6 వేల మంది వీక్షించారు.

తమిళనాడులోని మెగామలైలోని శ్రీవిలిపుత్తూరు టైగర్ రిజర్వ్‌లో ఈ కొత్త జాతి సీతాకోకచిలుకను పరిశోధకులు కనుగొన్నారు. ఈ సీతాకోక చిలుక పూర్తి నీలం రంగుతో ఆకట్టుకునేలా ఉంది. దీంతో పశ్చిమ కనుమల్లో 33ఏళ్ల తర్వాత ఇలాంటి కొత్త జాతి సీతాకోకచిలుకను గుర్తించినట్లు సుప్రియ పేర్కొన్నారు.

ఈ సీతాకోక చిలుకకు సిగరిటిస్ మేఘమలైయెన్సిస్ అని పేరు పెట్టారు ఐఏఎస్ సుప్రియ. ఈ ఆవిష్కరణతో పశ్చిమ కనుమల్లో కనబడుతున్న సీతాకోక చిలుకల జాతుల సంఖ్య 337కు చేరిందని తెలిపారు. ` ఇవి ఎవరికైనా కనిపించినా, కలలోకి వచ్చినా మంచి జరుగుతుందని నమ్ముతారు` అని ఓ నెటిజన్ తెలిపారు.

You may also like

Leave a Comment