Telugu News » Contonment By-Election: కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..!

Contonment By-Election: కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..!

కంటోన్మెంట్(Contonment By-Election) ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన నారాయణన్‌ శ్రీగణేశ్‌ను(Sri Ganesh) ఈసారి అధికార పార్టీ బరిలోకి దింపింది.

by Mano

కంటోన్మెంట్(Contonment By-Election) ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన నారాయణన్‌ శ్రీగణేశ్‌ను(Sri Ganesh) ఈసారి అధికార పార్టీ బరిలోకి దింపింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు.

Cantonment By-Election: Cantonment By-Election..Congress Candidate Finalized..!

శ్రీగణేష్ ఇటీవలే బీజేపీని వీడి అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి జే. గీతారెడ్డి శిష్యుడిగా సుపరిచితుడైన ఆయన 2014, 2018 ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం యత్నించారు. అయితే ఆయనకు రెండుసార్లూ నిరాశే ఎదురైంది. దాంతో చివరి నిమిషంలో బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ తెచ్చుకున్నా ఎన్నికల్లో ఓడిపోయారు.

ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మల్కాజిగిరి ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. 2023 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ తనకే దక్కుతుందని ఆశించారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే జీ.సాయన్న హఠాన్మరణం చెందడంతో ఆయన వారసురాలిగా కుమార్తె లాస్యనందితకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించింది. దాంతో శ్రీగణేశ్‌ మళ్లీ బీజేపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

లాస్యనందిత మృతి వల్ల త్వరలో జరిగే కంటోన్మెంట్‌ ఉపఎన్నికలో శ్రీగణేశ్‌ బీజేపీ నుంచి పోటీచేస్తారని అందరూ భావించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 40వేల ఓట్లు సాధించి, రెండోస్థానంలో నిలిచిన ఆయన ఉప ఎన్నికలో విజయం సాధిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి. అయితే అనూహ్యంగా ఆయన హస్తం గూటికి చేరారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు.

అయితే గత ఫిబ్రవరి నెలలో ఓఆర్ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతిచెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. లాస్యనందిత మృతితో త్వరలో జరిగే కంటోన్మెంట్‌ ఉపఎన్నికలో శ్రీగణేశ్‌ బీజేపీ నుంచి పోటీచేస్తారని అందరూ భావించారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరగా అధికార పార్టీ ఆయనకు కంటోన్మెంట్ ఉపఎన్నికలో పోటీ చేసే ఛాన్స్ ఇచ్చింది.

You may also like

Leave a Comment