Telugu News » Harish Rao: కాంగ్రెస్ మొద్దునిద్రను వదిలించేందుకే దీక్షలు: హరీశ్‌రావు

Harish Rao: కాంగ్రెస్ మొద్దునిద్రను వదిలించేందుకే దీక్షలు: హరీశ్‌రావు

సంగారెడ్డి(Sangareddy) పట్టణంలో బీఆర్‌ఎస్‌(BRS) రైతుదీక్షలో హరీశ్‌ రావుతో పాటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

by Mano
From 2004-19, the land of 'Medak' was BRS.. Genlupu Manadenaharish Rao this time too!

మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రను వదిలించేందుకే తాము దీక్షలు చేపట్టామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. సంగారెడ్డి(Sangareddy) పట్టణంలో బీఆర్‌ఎస్‌(BRS) రైతుదీక్షలో హరీశ్‌ రావుతో పాటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Harish Rao: Diksha to get rid of Congress slumber: Harish Rao

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) నెరవేర్చలేదన్నారు. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వం మరిచి రైతులను ముప్పుతిప్పలు పెడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాకే రైతులకు పుట్టెడు కష్టాలు వచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచిందన్నారు.

అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా  ప్రభుత్వంలో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత్వాన్ని మరిచి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం రైతులకు భరోసా ఇవ్వాలన్న సోయి కూడా సర్కారుకు లేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని చెప్పారు. కాంగ్రెస్‌ రాకతో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని, మోటర్లు కాలిపోతున్నాయని చెప్పారు.

కేసీఆర్‌ హయాంలో వ్యవసాయం ఒక పండుగా జరిగిందని, వడ్లను పుట్లకొద్దీ పండించారని తెలిపారు. కేసీఆర్‌ను తిట్టి ప్రజల దృష్టి మళ్లిస్తామంటే కుదరదని చెప్పారు. తమను ఎన్ని తిట్టినా రైతులకైతే న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒక్కటేనని, సాగుకు ఉరేసేలా బీజేపీ నల్లచట్టాలు చేసిందని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు పోరాటం చేశారని గుర్తుచేశారు. ఈ పోరాటంలో 700 మందికిపైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని రైతులకు సాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

You may also like

Leave a Comment