Telugu News » Kandala Upender Reddy : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేపై నమోదైన కేసు.. భూకబ్జా చేశారని ఆరోపణలు..!!

Kandala Upender Reddy : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేపై నమోదైన కేసు.. భూకబ్జా చేశారని ఆరోపణలు..!!

ఉపేందర్‌రెడ్డి తో పాటు మరికొందరు దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన భూమి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫ్లాట్ నం.8-డీలో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్రెడ్డి ‘8-Cలో స్థలాన్ని తమదిగా చెబుతున్నారు.

by Venu

హైదరాబాద్ (Hyderabad).. బంజారా హిల్స్ (Banjara Hills)లో, ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో.. బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే, కందాల ఉపేందర్‌రెడ్డి (Kandala Upender Reddy)పై భూకబ్జా కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో షేక్‌పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. బంజారాహిల్స్ రోడ్ నం.3లో ప్లాట్ నంబరు 8-c పేరుతో ఉన్న 2285 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్టు ఆరోపణలున్నాయి..

ఉపేందర్‌రెడ్డి తో పాటు మరికొందరు దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన భూమి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫ్లాట్ నం.8-డీలో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్రెడ్డి ‘8-Cలో స్థలాన్ని తమదిగా చెబుతున్నారు. ఈ సర్వే నంబరులో మొత్తం 2.25 ఎకరాలు ఉండగా అందులో అత్యధిక భాగం షౌకత్ నగర్ బస్తీగా ఏర్పడగా.. 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది.

మరోవైపు ఈ స్థలంలో అవెన్యూ సంస్థ గతంలోనూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా, అప్పటి తహసీల్దార్ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ల్యాండ్ బ్యాంక్ లో ఉంచారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు.. విధుల్లో భాగంగా తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు.. అక్కడ ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి, షెడ్లు నిర్మించి, వైన్స్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

వెంటనే బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో తహసీల్దార్ లోపాటు సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్ చేశారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో, ఉపేందర్ రెడ్డి తో పాటు ఉన్న ఇతరులపై సెక్షన్లు 447, 427, 467, 468, 471, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

You may also like

Leave a Comment