Telugu News » Hanumantha Rao : హరీష్‌ రావ్‌ పై సీరియస్ అయిన వీహెచ్..!!

Hanumantha Rao : హరీష్‌ రావ్‌ పై సీరియస్ అయిన వీహెచ్..!!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలేదని.. ప్రభుత్వ పాలన విధానాలు తెలిసి దిగజారి మాట్లాడటం తగదని హనుమంతరావు సూచించారు.. మేము ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తామని, తొందర పడకండని అన్నారు.

by Venu

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ (BRS) నేతలు పలు విమర్శలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నారు.. ఇక హరీష్ రావు (Harish Rao) పథకాల అమలుపై పలు సార్లు ప్రశ్నించడంతో పాటు ఘాటుగా విమర్శలు చేస్తుండగా.. వీటిపై మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు.

ఇంతలా తొందరపడే హరీష్ రావు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులకి మూడు ఎకరాల భూమి.. డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం అని మాటిచ్చి ఎందుకు తప్పారని ప్రశ్నించారు.. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలకి ఏం చేశావని మండిపడ్డారు.. మీరు ఇచ్చిన ఎన్ని హామీలు అమలు చేశారో బహిరంగంగా వెల్లడించాలని హనుమంతరావు (Hanumantha Rao) డిమాండ్ చేశారు..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలేదని.. ప్రభుత్వ పాలన విధానాలు తెలిసి దిగజారి మాట్లాడటం తగదని హనుమంతరావు సూచించారు.. మేము ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తామని, తొందర పడకండని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. మరోవైపు ఆరు గ్యారెంటీ లు.. బీఆర్ఎస్ ఫెయిల్యూర్ ని జనంలోకి తీసుకెళ్లడంలో రేవంత్ సక్సెస్ అయ్యారని హనుమంతరావు అన్నారు..

You may also like

Leave a Comment