ఏపీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కూటమి.. వైసీపీ (YCP) ఓటమి టార్గెట్ గా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం మహిళ సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక కామెంట్స్ చేశారు.. ధర్మాన ప్రసాద రావు పేరు లోనే అధర్మం ఉందని విమర్శించారు. ఆయన మాటమీద నిలబడని వ్యక్తి అని ఆరోపించారు..
మహిళలకు ఎప్పుడు అండగా ఉండే పార్టీ టీడీపీ (TDP) అని పేర్కొన్న చంద్రబాబు.. వారి ఆస్తిలో సమాన హాక్కు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళను ఆర్ధికంగా నిలిపినట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అసమర్ధ ప్రభుత్వం అని మండిపడ్డ ఆయన.. మహిళ జీవన స్థితిగతులను నాశనం చేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పంచదార కూడా చేదు అయిందని ఎద్దేవా చేశారు.. ఆయన మద్యం నిషేధం చేయకపోగా…గంజాయిని విచ్చలవిడి చేసారని ఆరోపించారు. ఒరిస్సా కంటే పెట్రోల్.. డీజిల్ ధరలు ఏపీలో పది శాతం అదనం అయ్యాయని తెలిపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడని ఈ దోపిడి వల్ల పేదలు నిరుపేదలు అయ్యారని ధ్వజమెత్తారు..
జగన్ ఉట్టుట్టి బటన్ నొక్కి ఖజానా ఖాళీ చేసాడని విమర్శించిన బాబు.. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం, అలాగే.. పోలీసులకు పీఎఫ్ కూడా ఇస్తానని పేర్కొన్నారు.. ఇల్లుకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారందరి ఇల్లు ఇస్తానన్నారు. శవరాజకీయలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని భరించింది ఇక చాలని విమర్శించారు..
మరోవైపు పెన్షన్ ను 4 వేలు చేస్తానని పేర్కొన్న చంద్రబాబు.. ఏప్రిల్ నుంచి ఇంటిదగ్గరే పెన్షన్ ఇస్తానని వివరించారు.. పనుల్లో కనీస వేతనాలు అమలుచేస్తాను. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో మినీ జెట్టీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.. రాష్ట్రాని కి పట్టిన కెన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అయితే… శ్రీకాకులానికి పట్టిన కేన్సర్ గడ్డ ధర్మాన ప్రసాదరావు అని విమర్శలు గుప్పించారు..