Telugu News » ఒకేఒక్కడు మూవీ పై… అప్పట్లో చంద్రబాబు ఏమని కామెంట్ చేసారో తెలుసా.. అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యరు మీరు…!

ఒకేఒక్కడు మూవీ పై… అప్పట్లో చంద్రబాబు ఏమని కామెంట్ చేసారో తెలుసా.. అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యరు మీరు…!

by Sravya

మన దేశంలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. టాప్ డైరెక్టర్లులో శంకర్ కూడా ఒకరు. తమిళ దర్శకుడు శంకర్ చాలా బ్లాక్ బస్టర్ సినిమాలని తెర మీదకి తీసుకువచ్చారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు, రోబో వంటి సినిమాలు రికార్డులను క్రియేట్ చేశాయి. శంకర్, రామ్ చరణ్ హీరోగా ఒక పొలిటికల్ డ్రామాని తెర మీదకు తీసుకు వస్తున్నారు. భారీ బడ్జెట్లో ఈ సినిమాని తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో కూడా శంకర్ ఒక సినిమాని తెర మీదకి తీసుకువస్తున్నారు.

అపరిచితుడు సినిమాకి రీమేక్ గా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ తీసిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకే ఒక్కడు సినిమా కూడా ఉంది. ఒక్కరోజు ముఖ్యమంత్రి అని సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఓ సీన్ ని 400 మంది ఆర్టిస్టులతో దాదాపు 40 రోజులు పాటు షూట్ చేశారట. సినిమాలోని మగధీర పాటని మైసూర్ ప్యాలెస్ లో షూట్ చేశారు.

Also read:

ఈ పాట కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పైగా ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం లండన్ నుండి ఎక్స్పెర్ట్స్ తీసుకువచ్చారు. అప్పట్లో సౌత్ లో 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన మొదటి సినిమా ఇదే. మూవీ వచ్చిన తర్వాత సినిమాలోని రఘువరన్ క్యారెక్టర్ తమిళనాడు సీఎంని పోలి ఉందని అక్కడ భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం శంకర్ ని పిలిచి మరీ అభినందించారు.

You may also like

Leave a Comment