Telugu News » Chandrayaan-3 చంద్రయాన్-3 తో వచ్చే లాభాలివే !

Chandrayaan-3 చంద్రయాన్-3 తో వచ్చే లాభాలివే !

by umakanth rao
Isro

 

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో ఇండియాకు కలుగుతున్న ప్రయోజనాలు ఇన్నీ అన్నీ కావు. దేశ అంతరిక్ష సంబంధ ప్రాజెక్టుల్లో ఇక పెట్టుబడులు వెల్లువ కావచ్చు. భారత స్పేస్ సెక్టార్ కంపెనీలు ఇక క్యూ కట్టనున్నాయి. రాకెట్ కమ్యూనికేషన్ లోను, నావిగేషన్ లోనూ రాకెట్ కమ్యూనికేషన్ లోను వినియోగించే ఎలెక్ట్రానిక్స్ నుంచి మెటల్ గేర్స్ వరకు ఆయా పరికరాలను, సాధనాలను సప్లయ్ చేసే 13 కంపెనీల స్టాక్స్ ఈ వారం మార్కెట్ కి మరో 2.5 బిలియన్ డాలర్లకు పైగా సొమ్మును అదనంగా వచ్చేట్టు చేశాయని బ్లూమ్ బెర్గ్ తెలిపింది.

With India's One Giant Step, Chandrayaan 3, Moon Race Heats Up

 

ఇదే సందర్భంగా రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలం కావడాన్ని కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ గ్యాస్ ఫర్మ్ .. ‘లిండే ఇండియా’ ఆధ్వర్యంలోని స్పేస్ఎం క్రాఫ్ట్ సప్లయర్ల ప్రయోజనాలు ఈ వారంలోనే 23 శాతం పైగా పెరిగాయి. తమ మిషన్ కు క్రిటికల్ సిస్టమ్స్ ను, మాడ్యూల్స్ ను సరఫరా చేసే సెంటమ్ ఎలెక్ట్రానిక్స్ ప్రయోజనాలు 11 శాతం పైగా పెరగగా . శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్ అయిన అవాంటెల్ కూడా 12 శాతం పైగా లాభాలను చవి చూసింది.

మూన్ మిషన్ వంటి క్రిటికల్ ప్రాజెక్టుల్లో పాల్గొనే ఆయా కంపెనీలకు అవకాశాలు కలిసొస్తాయని ముంబై లోని వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన స్ట్రాటిజిస్ట్ క్రాంతి బత్తిని తెలిపారు. గ్లోబల్ ప్రాజెక్టుల్లో ఇవన్నీ భాగమవుతాయన్నారు. కొన్ని లిస్టెడ్ సంస్థల షేర్లు అప్పుడే ఎగబాకాయి. వీటిలో ఎల్ అండ్ టీ, మిశ్రధాతు నిగమ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వంటివి ఉన్నాయి. భెల్ తప్ప మిగిలిన అన్ని కంపెనీల షేర్లు పాజిటివ్ ట్రెండ్ లోనే నడిచాయి. ముఖ్యంగా లార్సెన్ అండ్ టూబ్రో, మిశ్రధాతు నిగమ్, భెల్ చంద్రయాన్-3 మిషన్ లో కీలక పాత్ర పోషించాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, వాల్ చంద్ నగర్ ఇండస్ట్రీస్, ఎం టీ ఏ ఆర్ టెక్నాలజీస్ సంస్థలు వివిధ దశల్లో ఈ మిషన్ కు సహకరించాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా 2013 నుంచి 1791 అంతరిక్ష టెక్నాలజీ సంస్థల్లో రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్పేస్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి అంతరిక్ష ఆర్ధిక వ్యవస్థ విలువ రూ. 45 లక్షల కోట్లుగా తేలింది. పదేళ్లలో ఈ రంగం విలువలో 91 శాతం వృద్ధి నమోదైంది. కాగా ఈ మిషన్ సక్సెస్ తో చంద్రుని ఉపరితలం, పర్యావరణంపై పరిశోధనలు చేయగలుగుతారు. ముఖ్యంగా దక్షిణ ధృవంపై ఐస్, నీరు వంటి వనరులు ఉన్న దృష్ట్యా ఈ పరిశోధనల విషయంలో ఇతర దేశాలకు మన దేశం మార్గదర్శకం కానుంది. జాబిల్లిపై శాశ్వత నివాస పరిశోధనలకు ఊతం లభించనుంది. చంద్రుని పుట్టుక, పరిణామంపై మరిన్ని పరిశోధనలకు ఈ మిషన్ తోడ్పడనుంది . ఇతర దేశాల భవిష్యత్ ప్రయోగాలకు కూడా ఇది దోహదం చేయనుంది. ఈ వ్యోమనౌక చంద్రునిపై రెండు వారాలు పరిశోధనలు చేయనుంది.

 

You may also like

Leave a Comment