ప్రపంచంలో ఏ దేశానికీ వీలు కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే.. ఇస్రో (ISRO) సాధించిన ఈ ఘనతపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. మొదట చంద్రయాన్ 1 (Chandrayaan 1), తర్వాత చంద్రయాన్ 2 ప్రయోగాలు చేపట్టినా.. చంద్రయాన్ 3 ప్రయోగంతోనే భారత్ (Bharath) ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది..

పంజాబ్ (Punjab) లుధియానా (Ludhiana)లో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారతదేశం అంతరిక్ష రంగంలో గొప్ప పురోగతి సాధిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.. మరోవైపు చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2040 లో చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు.
అలాగే ఇస్రో అంతరిక్ష పరిశోధనతో పాటు వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా విద్యార్థులను భాగస్వామ్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.. కాగా ఇస్రో జాబిల్లిపై ఉండే రాళ్లు, మట్టి నమూనాలను ఈ మిషన్‌లో భాగంగా భూమి మీదకు తీసుకురావాలని భావిస్తోందన్నారు. చంద్రుడి మీద దాదాపు 100 రోజులు పరిశోధనలు చేసేలా.. కిలోమీటరు మేర చంద్రుడిపై తిరిగేలా ఆ వ్యోమనౌకను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా 2024 కు సంబంధించి ‘జాన్ ఎల్ జాక్ స్విగెర్ట్ జూనియర్’ అవార్డు.. చంద్రయాన్ 3 శాస్త్రవేత్తల టీమ్‌కు లభించిందని వివరించారు. ఇస్రో తరఫున అమెరికా హ్యూస్టన్‌లో భారత కాన్సుల్ జనరల్ మంజునాథ్ పురస్కారాన్ని అందుకొన్నారు…