Telugu News » PM Modi : ప్రజలను విభజించాలని చూస్తున్న డీఎంకే.. ప్రధాని మోడీ..!

PM Modi : ప్రజలను విభజించాలని చూస్తున్న డీఎంకే.. ప్రధాని మోడీ..!

ప్రస్తుత డీఎంకే ఒక్క ఓటు కూడా పొందే పరిస్థితిలో లేదని.. తమిళ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని మోడీ వెల్లడించారు.. అలాగే 2014కి ముందు భారతదేశం కుంభకోణాలకు ప్రసిద్ధి చెందిందని ఆరోపించారు..

by Venu
madhya pradesh pm modi says bjp alone will cross 370 seats in lok sabha elections

దేశంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ (BJP).. పరిస్థితులకి అనుకూలంగా ప్రత్యర్థులపై విమర్శలు చేసుకొంటూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఇక స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగి.. పార్టీ విజయాన్ని తన భుజాలపై వేసుకొన్నారు.. ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. ఈ క్రమంలో వెల్లూరులో నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

PM Modi: The world will listen to us only if the country is strong: PM Modiతమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) చేస్తున్న కుటుంబ రాజకీయాల వల్ల యువత ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయిందని మండిపడ్డారు.. ఒకే ఫ్యామిలీకి చెందిన సంస్థగా డీఎంకే మారిందని ఆరోపించిన ఆయన.. అవినీతిలో ఆ పార్టీ మొదటి కాపీరైట్ కలిగి ఉందని ఎద్దేవా చేశారు.. రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసిందని ప్రధాని విమర్శలు గుప్పించారు..

అలాగే తమిళనాడు (Thamilnadu)ను పాత ఆలోచనలు, పాత రాజకీయాల్లో డీఎంకే బంధించాలనుకుంటోందని ధ్వజమెత్తారు.. తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తోందని మండిపడ్డారు. ఇక్కడి ప్రజలను భాష, ప్రాంతం, విశ్వాసంతో విభజించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోన్నట్లు ఆరోపించారు. ఈ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని మోడీ (Modi) పేర్కొన్నారు.. త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు..

ప్రస్తుత డీఎంకే ఒక్క ఓటు కూడా పొందే పరిస్థితిలో లేదని.. తమిళ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని మోడీ వెల్లడించారు.. అలాగే 2014కి ముందు భారతదేశం కుంభకోణాలకు ప్రసిద్ధి చెందిందని ఆరోపించిన ఆయన.. ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని వివరించారు.. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే, బీజేపీకి ఇక్కడ అపూర్వ మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు..

You may also like

Leave a Comment