పేద ప్రజల కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) కీలక నిర్ణయం తీసుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. పేదలకు అతి విలువైన వాటిలో వైద్యం ఒకటి.. ప్రస్తుతం ఇది చాలా ఖరీదుగా మారిన సంగతి తెలిసిందే.. అయితే పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు భారీ ఆసుపత్రిని రజనీ నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక సూపర్ స్టార్ హోదా ఉన్నా.. సాదా సీద జీవితాన్ని ఇష్టపడే రజనీకాంత్ అంటే ఇష్టం లేని వారుండరు..
ఇదిలా ఉండగా వాస్తవానికి ఒకగానొక సమయంలో రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని భావించారు. కానీ వయసురిత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు వస్తాయిని వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.. రాజకీయాల్లోకి రానప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు తన రాజకీయ పార్టీని సమాజ్ సేవా సంఘ్గా మార్చిన విషయం తెలిసిందే.
అయితే సేవా భావం ఉన్న రజనీకాంత్.. పేదల కోసం ఒక ఆసుపత్రిని (Hospital) నిర్మించాలనే ప్లాన్ లో భాగంగా.. తమిళనాడు (Tamil Nadu), చంగల్పట్టు (Changalpattu) జిల్లా తిరుప్పురూర్ (Tiruppurur)లో 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితమే 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొన్నారని అంటున్నారు..
అందరికీ అందుబాటులో అక్కడ ఆసుపత్రిని నిర్మించాలని రజనీ ఉన్నారట. త్వరలో భూమి పూజ కూడా ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ స్థలంపై కచ్చితమైన సమాచారం బయటకు రానప్పటికీ ఆసుపత్రి నిర్మాణం కోసమే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇక సినిమాలలో తనదైన మ్యానరిజంతో అభిమానులను ఏర్పరచుకొన్న రజనీకాంత్.. ఇటీవల నటించిన లాల్ సలామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేక పోయింది. ప్రస్తుతం వెట్టయాన్ అనే మూవీలో నటిస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తారని తెలుస్తోంది.