Telugu News » Anchor Suma: ‘నా గుండె పగిలేలా వుంది..’ యాంకర్ సుమ ఎమోషనల్..!!

Anchor Suma: ‘నా గుండె పగిలేలా వుంది..’ యాంకర్ సుమ ఎమోషనల్..!!

తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘రజాకార్’(Rajakaar). తాజాగా ఈ సినిమాను చూసిన స్టార్ యాంకర్ సుమ కనకాల(Anchor Suma Kanakala) ఎమోషనల్ ట్వీట్ చేసింది.

by Mano
Anchor Suma: 'My heart is breaking...' Anchor Suma is emotional..!!

తెలంగాణ(Telangana) చారిత్రక కథాంశంతో ఇప్పటి వరకు అనేక సినిమాలు వచ్చాయి. ఇదే కోవలో తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘రజాకార్’(Rajakaar). ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 15న విడుదలై పాజిటివ్ టాక్‌ను అందుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Anchor Suma: 'My heart is breaking...' Anchor Suma is emotional..!!

తాజాగా ఈ సినిమాను చూసిన స్టార్ యాంకర్ సుమ కనకాల(Anchor Suma Kanakala) ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘‘జస్ట్ ఇప్పుడే రజాకార్ సినిమా చూశాను. ఆ సంఘటనలు, హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాన్ని చూసి గుండె పగిలేలా ఉంది. చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించినందుకు డైరెక్టర్‌కు ధన్యవాదాలు.. అనుసుయ, ప్రేమ, ఇంద్రజ, నటులు సింహా అందరూ చాలా బాగా నటించారు..’’ సూపర్ అంటూ సుమ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం సుమ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాటా సత్యనారాయణ డైరెకక్షన్‌లో బాబీసింహా, అనసూయ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘రజాకార్’. ఇందులో రాజ్ అర్జున్, మార్కండ్ దేశ్‌పాండే, ఇంద్రజ, తేజ్ సప్రు, తలైవాస్ విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని యథార్ఘ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు మూవీ టీమ్ తెలిపింది.

ఇక ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇంతటి దారుణాలు జరిగాయా? అని తెలంగాణ చరిత్రను తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకుని చలించిపోతున్నారు. ఇప్పటి వరకు ఒసేయ్ రాములమ్మ, రాజన్న, ఇటీవల విడుదలైన ‘రుద్రంగి’ చిత్రాలు తెలంగాణ నేపథ్యంలో చిత్రీకరించిన సినిమాలే. ఇప్పుడు ఈ తరహా సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

You may also like

Leave a Comment