Telugu News » PM Modi : మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశంసల వర్షం…!

PM Modi : మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశంసల వర్షం…!

ప్రస్తుత ప్రభుత్వం తన విధానాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తోందని ప్రశంసించారు.

by Ramu
Chidambaram surprises with praise for Modi govt at Literary festival

ప్రధాని మోడీ (PM Modi)ని కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం (P.Chidambaram) పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం తన విధానాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. ఈ విషయాన్ని ఒప్పు కోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు.

Chidambaram surprises with praise for Modi govt at Literary festival

ఏపీజే కోల్‌కతా లిటరరీ ఫెస్టివల్-2024లో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ. చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. మోడీ ప్రభుత్వంపై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు పలు అంశాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా భయం అనే భావన వ్యాపించి ఉందని వెల్లడించారు.

ఆ భయం ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకమని వెల్లడించారు. గత ఏడాది కాలంలో దేశంలో భయాందోళనలకు లోను కానీ ఏ వ్యక్తిని తాను చూడలేదని చెప్పారు. ఈ 18 నెలల్లో తాను ఎక్కడికి వెళ్లినా… తాను ఎవరితో మాట్లాడినా వారిలో భయం అనే ఆలోచన ఆదిపత్యం చేయడం కనిపించిందన్నారు.

తాను కలిసిన వ్యక్తుల్లో ఏ వ్యాపారవేత్త, న్యాయవాది, డాక్టర్ లేదా చిన్న తరహా పరిశ్రమలతో సంబంధం ఉన్న వారెవరూ తాము ఏమి చెప్పాలనుకుంటే అది చెప్పవచ్చని, ఏ సినిమా కావాలంటే అది తీయ వచ్చని ఎవరూ చెప్పలేదన్నారు. దేశంలో భయం ఆధిపత్యం, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఆలోచన భయం లేని చోట ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పారు.

You may also like

Leave a Comment