Telugu News » Chilika Lake: సరస్సులో చిక్కుకున్న పడవ.. కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం..!

Chilika Lake: సరస్సులో చిక్కుకున్న పడవ.. కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం..!

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల మంత్రి పురుషోత్తం రూపాల కు పెద్ద ప్రమాదమే తప్పింది. ఒడిశాలోని చిలికా సరస్సులో ఆయన ప్రయాణిస్తున్న పడవ చిక్కుకుపోయింది. వెంటనే స్పందించిన సిబ్బంది చిలికా సరస్సులోకి మరో పడవను పంపించి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.

by Mano
Chilika Lake: A boat stuck in the lake.. Union Minister missed an accident..!

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల మంత్రి(Union Minister) పురుషోత్తం రూపాల(Purushotham Rupala)కు పెద్ద ప్రమాదమే తప్పింది. ఒడిశాలోని చిలికా సరస్సులో ఆయన ప్రయాణిస్తున్న పడవ ఆదివారం సాయంత్రం రెండు గంటల పాటు చిక్కుకుపోయింది.

Chilika Lake: A boat stuck in the lake.. Union Minister missed an accident..!

అయితే, వెంటనే స్పందించిన సిబ్బంది చిలికా సరస్సులోకి మరో పడవను పంపించి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. 11వ దశ ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులతో సమావేశం అయ్యేందుకు ఒడిశా పర్యటనకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వచ్చారు. ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు పడవలో బయల్దేరారు.

Chilika Lake: A boat stuck in the lake.. Union Minister missed an accident..!

మంత్రితో పాటు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, ఇతర స్థానిక పార్టీ నాయకులు కూడా పడవలో ఉన్నారు. చీకటి పడడంతో పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో నుంచి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో దారి తప్పిపోయారు. చిలికా సరస్సు మధ్యలో నలబానా పక్షుల అభయారణ్యం సమీపంలో పడవ సుమారు రెండు గంటలపాటు చిక్కుకుపోయింది.

మంత్రి సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పూరీ జిల్లాలోని కృష్ణప్రసాద్ ఏరియా సమీపంలో జరిగే కార్యక్రమానికి మంత్రి హాజరు కావాల్సి ఉండగా ఈ ఘటన కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. కేంద్ర మంత్రి రాత్రి 10.30 గంటలకు పూరీకి చేరుకున్నారని ఓ అధికారి తెలిపారు.

You may also like

Leave a Comment