Telugu News » Telangana : కాంగ్రెస్ ఆరు హామీల దరఖాస్తుదారులకు పోలీసుల వార్నింగ్..!!

Telangana : కాంగ్రెస్ ఆరు హామీల దరఖాస్తుదారులకు పోలీసుల వార్నింగ్..!!

మీకు రేషన్ కార్డు, ఇల్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ తదితర పథకాలు మంజూరయ్యాయని, మీ ఫోన్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుందని లబ్ధిదారులకు ఫోన్ చేసి చెబుతోన్నారు.

by Venu
telangana congress cm swearing ceremony telangana assembly election results 2023

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోని అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.. అయితే ఈ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ఇంత వరకి ఏ ప్రకటన చేయలేదు.. కానీ పోలీసులు (Police) మాత్రం హెచ్చరిక జారీ చేశారు..

ఇందుకు కారణం.. సైబర్ మోసగాళ్లు (Cyber ​​Criminals) ప్రజా పాలనలో జనం ఇచ్చిన దరఖాస్తులపై కన్నేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా సైబర్ మోసగాళ్లు తమ రూట్ మార్చుకొని, లబ్ధిదారులకు ఫోన్ చేసి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని, తెలంగాణ (Telangana) పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీకు రేషన్ కార్డు, ఇల్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ తదితర పథకాలు మంజూరయ్యాయని, మీ ఫోన్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుందని లబ్ధిదారులకు ఫోన్ చేసి చెబుతోన్నారు.

ఆ ఓటీపీ నంబర్ చెబితే.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయని నమ్మించి నట్టేట ముంచుతోన్నారు. ఇలాగే కొందరు ఇలా డబ్బులు పోగొట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.. కాబట్టి ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు, లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎవరూ అలాంటి కాల్స్ చేయరని క్లారిటీ ఇస్తున్నారు.

ఒకవేళ అలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.. కాగా అర్హులైన అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యాక.. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలతో.. ఈ దరఖాస్తుల్లో ఉన్న వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి ఎలా చిక్కాయనే అనుమానాలు జనంలో మొదలైనట్టు అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment