Telugu News » కష్టపడకుండా రీరికార్డింగులు.. నేను ఆ టైప్ కాదు.. ఆ టాప్ హీరో పై చిరు కామెంట్స్ …!

కష్టపడకుండా రీరికార్డింగులు.. నేను ఆ టైప్ కాదు.. ఆ టాప్ హీరో పై చిరు కామెంట్స్ …!

by Sravya

మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా, ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరును తెచ్చుకున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా చిరు పెంచుకున్నారు. అయితే ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. o స్టార్ హీరో పై పరోక్షంగా సెటైర్లు వేశారని వినపడుతోంది, చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమా హిట్ కాలేదు. పైగా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. చిరంజీవికి ఆ సినిమా హిట్ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఆయనకి ఫాన్స్ సలహాలు కూడా ఇచ్చారు. హీరోయిన్స్ తో డాన్స్లు, ఫైట్లు ఏంటి వయసుకు తగ్గట్టుగా నటించమని కూడా చాలామంది అన్నారు.

పైగా రజనీకాంత్ కమల్ హాసన్ వంటి హీరోలని చూసి సినిమాలు చేయమని కూడా చెప్పారు. భోళా శంకర్ సినిమా ఘోరంగా ఫ్లాప్ అవడంతో రీమేక్ సినిమాలు తీసుకోవడం మంచిది కాదని చిరు అనుకున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ చక్కగా సెట్ పైకి వెళ్లి మేకప్ వేసుకొని, ఏ మాత్రం కష్టపడకుండా నడిచి వస్తుంటే, రీ రికార్డింగ్ తో ఎలివేట్ చేస్తారులే అనుకును డబ్బులు తీసుకుని జేబు లో పెట్టేసుకుని టైప్ నేను కాదు అని.. హీరో అన్నాక ఆడాలి పాడాలి ఫైట్లు చేయాలి.

Also read:

ఒళ్ళు మొత్తం హూనం చేసుకోవాలి అని చెప్పారు చిరు. అప్పుడే ఆడియన్స్ కి నిర్మాతలకి దర్శకులకి నాకు కూడా సంతృప్తి అని చెప్పారు చిరు. ఈ మాటలు రజనీకాంత్ ని ఉద్దేశించి చిరు చెప్పినట్లు సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది జైలర్ సినిమా. రజనీకాంత్ పై వచ్చే ఎలివేషన్స్ సీన్లతో ఈ సినిమా సాగుతుంది బిజిఎం మూవీకి ప్లస్ అయింది. ఇది రజనీకాంత్ కూడా ఒప్పుకున్నారు. రీ రికార్డింగ్ కి ముందు జైలర్ చూసి అంత గొప్ప సినిమా కాదని అనుకున్నానని రజనీకాంత్ స్వయంగా చెప్పారు. చిరు చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

You may also like

Leave a Comment