Telugu News » వెంకటేష్ హీరో అయితే నాకు పోటీ కి వస్తాడేమో అని భయపడిపోయా… చిరు కామెంట్స్ వైరల్..!

వెంకటేష్ హీరో అయితే నాకు పోటీ కి వస్తాడేమో అని భయపడిపోయా… చిరు కామెంట్స్ వైరల్..!

by Sravya

టాలీవుడ్ అగ్ర హీరోల లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. వెంకటేష్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఎన్నో మంచి సినిమాల్లో నటించి మంచి పేరుని తెచ్చుకున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన వెంకటేష్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి దాకా వెంకటేష్ తన కెరీర్లు 74 సినిమాల్లో నటించారు. 75వ సినిమాగా సైంధవ్‌ సినిమా సంక్రాంతి కి రాబోతోంది వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సైంధవ్‌ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది.

ఈవెంట్ కి గెస్ట్ లు కింద రాఘవేందర్రావు, చిరంజీవి వచ్చారు. నాని, శ్రీ విష్ణు, అడవి శేషు, బ్రహ్మానందం, అలీ ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ ఈవెంట్ కి వచ్చింది. ఈవెంట్లో అందరూ వెంకటేష్ తో తమకి ఉన్న అనుబంధాన్ని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి కూడా అనుబంధాన్ని పంచుకున్నారు. కొన్ని వేడుకలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. అలానే ఈ వేడుక కూడా అలాంటిదే అని అన్నారు.

Also read:

నాకు వెంకీ తో 40 ఏళ్ల అనుబంధం ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ లో 1983లో సంఘర్షణ సినిమా చేశానని అప్పుడే నాకు సురేష్ బాబు పరిచయం అయ్యారు అన్నారు. రామానాయుడు గారికి రెండో అబ్బాయి ఉన్నాడు అని అప్పుడే తెలిసిందని కొన్నాళ్ల తర్వాత అందంగా ఉన్న వెంకటేష్ ని చూసాను. నాలో భయం మొదలైంది. తాను హీరో అయితే నాకు గట్టి పోటీ ఇస్తారని భయపడ్డాను అని చిరంజీవి అన్నారు. సినిమాలు మీద తనకి ఆసక్తి లేదని రామానాయుడు చెప్పాక హమ్మయ్య అనుకున్నానని రెండేళ్ల తర్వాత వెంకీ సినిమాలు చేయడం మొదలు పెట్టాడని చిరు అన్నారు. వెంకటేష్ సినిమాల్లో మల్లీశ్వరి అంటే నాకు ఇష్టమని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు.

You may also like

Leave a Comment