Telugu News » AP CID : నారా లోకేష్‌కు షాకిచ్చిన సీఐడీ.. నోటీసులు జారీచేసిన కోర్టు..!!

AP CID : నారా లోకేష్‌కు షాకిచ్చిన సీఐడీ.. నోటీసులు జారీచేసిన కోర్టు..!!

వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది కదా..? అని లోకేష్ అన్నారు. ఈ తరహా సినిమాలు ఎన్నికల ముందు తీయడం ఓ ఫ్యాషన్ అయిందని లోకేష్ మండిపడ్డారు. ఎన్నికల ముందు కొత్త డ్రామాలకు తెరతీసిన సీఎం జగన్.. నేరుగా ఎదుర్కోలేక డబ్బులు పంచి ఇలాంటి సినిమాలు తీసేలా చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు..

by Venu

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో టీడీపీ (TDP) ప్రజలకి చేరువ కావడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలాగే వైసీపీ (YCP) సైతం.. రెండో సారి గెలవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల పోరు రసవత్తంగా మారనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh)కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

naralokesh1

నారా లోకేష్ రెడ్‌బుక్‌ పేరుతో బెదిరిస్తున్నారని అధికారులు CID కోర్టును ఆశ్రయించారు. దీంతో నారా లోకేష్‌కు నోటీసులు ఇవ్వాలని CID న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు వాట్సాప్‌లో నోటీసులు పంపారు. మరోవైపు సీఐడీ కోర్టు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.

వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది కదా..? అని లోకేష్ అన్నారు. ఈ తరహా సినిమాలు ఎన్నికల ముందు తీయడం ఓ ఫ్యాషన్ అయిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు కొత్త డ్రామాలకు తెరతీసిన సీఎం జగన్.. నేరుగా ఎదుర్కోలేక డబ్బులు పంచి ఇలాంటి సినిమాలు తీసేలా చేస్తున్నారని ఆరోపించారు.. ఆర్జీవీ తరపున కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్న.. వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డిని.. అక్కడున్న అడ్వకేట్లను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని లోకేష్ ఎద్దేవా చేశారు..

నిజంగా సినిమా తీయాలని ఉంటే.. హు కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్సులో జరుగుతున్న అవినీతి అని టైటిల్స్ పెట్టి సినిమాలు తీయొచ్చుకదా అని నారా లోకేష్ అన్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ చిత్రం నేడు విడుదల కావాల్సి ఉంది. కానీ గురువారం ఈ మూవీ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. జనవరి 11వ తేదీ వరకు విడుదల చేయవద్దంటూ ఆదేశాలు జారీచేసింది.

You may also like

Leave a Comment