Telugu News » TSRTC : తీరనున్న తెలంగాణ ప్రయాణికుల కష్టాలు.. రోడ్డెక్కనున్న కొత్త బస్సులు..!!

TSRTC : తీరనున్న తెలంగాణ ప్రయాణికుల కష్టాలు.. రోడ్డెక్కనున్న కొత్త బస్సులు..!!

హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం 10 గంటలకు ఈ కొత్త బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపిన సజ్జనార్.. వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.

by Venu

తెలంగాణ (Telangana) ఆర్టీసీ ప్రయాణికులకు, టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ, సజ్జనార్ (Sajjanar) శుభవార్త చెప్పారు. అందుబాటులోకి మరిన్ని కొత్త బస్సులు వస్తున్నాయని ప్రకటించారు. రూ.400 కోట్ల వ్యయంతో వెయ్యికి పైగా అధునాతన డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో 80 బస్సులను రేపు ప్రారంభించనున్నట్లు సజ్జనార్ తెలిపారు.

problems in free bus travel complain to these numbers sajjanar

రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతోన్న తెలంగాణ ఆర్టీసీ.. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో 400 ఎక్స్ ప్రెస్ బస్సులు కాగా.. 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయని అధికారులు తెలిపారు..

ఈ బస్సులతో పాటుగా.. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను సైతం కనుగోలు చేస్తున్నట్టు సజ్జనార్ వెల్లడించారు.. అందులో నగరంలో 540 బస్సులు అందుబాటులోకి రానుండగా.. తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో 500 బస్సులను, టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తెస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి, 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది.

మరోవైపు మహాలక్ష్మి స్కీమ్‌ (Mahalakshmi Scheme) వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనున్నట్టు సజ్జనార్ వెల్లడించారు. కాగా అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వాడకంలోకి వస్తున్నట్టు తెలిపారు. వాటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నట్లు సజ్జనార్ తెలిపారు.

హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం 10 గంటలకు ఈ కొత్త బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపిన సజ్జనార్.. వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.

You may also like

Leave a Comment