Telugu News » BRS : బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు.. కుర్చీలతో యుద్ధం చేసుకొన్న ఎమ్మెల్సీ-మాజీ ఎమ్మెల్యే..!!

BRS : బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు.. కుర్చీలతో యుద్ధం చేసుకొన్న ఎమ్మెల్సీ-మాజీ ఎమ్మెల్యే..!!

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇలా ఇరు వర్గాల పరస్పర నినాదాలతో అక్కడి వాతావరణం వేడేక్కింది. దీంతో ఆవేశానికి లోనైన పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి కుర్చీలు విసురుకోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

by Venu

అడవిలో ఉంటేనే సింహం రాజులా ఉంటుందని అంటారు.. అలాగే అధికారంలో ఉంటేనే నేతలు మాటలు వింటారు.. లేకపోతే జరిగేది ఇదే అని నిరూపించారని ఈ సంఘటన గురించి తెలిసిన వారు అనుకొంటున్నారు.. అసలేం జరిగిందంటే.. బీఆర్ఎస్ (BRS) లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయనే వార్త దావానంలా వ్యాపిస్తుంది.

ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) అయిన గెలిచి పరువు కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో తెలంగాణ భవన్ లో శుక్రవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి (Mahender Reddy).. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (Rohit Reddy) అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. చేవెళ్ల లోక్ సభ సన్నాహక సమావేశంలో, మహేందర్ రెడ్డి మాట్లాడుతోన్న సమయంలో.. రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది..

ఈ క్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇలా ఇరు వర్గాల పరస్పర నినాదాలతో అక్కడి వాతావరణం వేడేక్కింది. దీంతో ఆవేశానికి లోనైన పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి కుర్చీలు విసురుకోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. మరోవైపు పార్టీ పరువు ఎక్కడ పోతుందో అని కొంత ఆందోళనకి గురైనట్టు తెలుస్తోంది.

ఇంతలో అక్కడే ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో వారు శాంతించినట్టు సమాచారం.. అదీగాక మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై బహిరంగంగా సమీక్ష సమావేశంలో గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని హరీష్ రావు ఇద్దరు నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్‌లో వర్గపోరు ఒక్క సారిగా కలకలం రేపింది. అయిన రాజకీయాలు అన్నాక ఇవన్నీ కామన్.. కానీ ప్రతిపక్షాలు ఫోకస్ చేస్తే ఈ అంశాలు రచ్చగా మారుతాయని తెలిసిందేగా అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment