Telugu News » CM Jagan: ఏపీలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించిన జగన్

CM Jagan: ఏపీలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించిన జగన్

వచ్చే ఏడాదికి మరో ఐదు కాలేజీలను అడ్మిషన్లు తీసుకునే విధంగా, ఆ తర్వాత ఏడాది మరో ఏడు మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేస్తామని సీఎం జగన్ చెప్పారు.

by Prasanna
Jagan 2

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (CM Jagan) విజయనగరం జిల్లా (Vizianagaram Dist) లో ప్రభుత్వ వైద్య కళాశాలను (Govt Medical Colleges) ప్రారంభించారు.  దీనితో పాటు వర్చువల్‌ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాలలో కాలేజీలను కూడా అక్కడ నుంచే ప్రారంభించారు. మెడికల్‌ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్‌ పరిశీలించారు. ట్రీట్మెంట్‌కు సంబంధించిన వివరాలు వైద్యులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాదికి మరో ఐదు కాలేజీలను అడ్మిషన్లు తీసుకునే విధంగా, ఆ తర్వాత ఏడాది మరో ఏడు మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేస్తామని సీఎం జగన్ చెప్పారు.

Jagan 1

విజయ­నగరం, ఏలూ­రు, రాజమహేంద్ర­వ­రం, మచిలీప­ట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటై­న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని సీఎం జగన్ చెప్పారు.  \

Jagan 2

రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని, కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయని, వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మి­షన్లు కూడా పొందారని తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్‌ కళాశాలలను ప్రారంభిస్తామని, ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఇంటారెక్ట్ అయ్యారు. తామంతా ప్రభుత్వ మెడికల్ కళాశాల్లో చదువుకుని ప్రజలకు సేవ చేసేందుకు వస్తామని మెడికల్ విద్యార్థులు సీఎంతో చెప్పారు.

You may also like

Leave a Comment