Telugu News » హీరో నవదీప్‌ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు!

హీరో నవదీప్‌ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు!

అటు పలు పబ్ ల పైనా నార్కోటిక్ పోలీసులు నిఘా వేశారు

by Sai
police issued notices to tollywood hero navadeep

టాలీవుడ్‌ హీరో నవదీప్ (Navadeep) కు బిగ్‌ షాక్‌ తగిలింది. హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేయనుంది టీఎస్‌ఎన్‌ఏబీ (TSNAB) పోలీస్‌ శాఖ. డ్రగ్స్(Drugs) కేసు (Case) లో పోలీసుల(Police) దర్యాప్తు (Investigation) కొనసాగుతోంది. డ్రగ్స్ వాడిన నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు….హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేయనున్నారు నార్కోటిక్ పోలీసులు.

police issued notices to tollywood hero navadeep

నిన్న పోలీసుల అందుబాటులోకి రాలేదు నవదీప్. షాడో సినిమా ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి ఇంకా పరారీలో ఉన్నాడు. అటు పలు పబ్ ల పైనా నార్కోటిక్ పోలీసులు నిఘా వేశారు.గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్ లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.

పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం నార్కోటిక్ పోలీసులు గాలిస్తున్నారు. కేపి చౌదరి లిస్ట్ లోనూ మోడల్ శ్వేతా పేరు కూడా ఉందని పోలీసులు తేల్చారు. ఈవెంట్ ఆర్గనైజర్ కలహార్ రెడ్డి కోసం నార్కోటిక్ పోలీసులు వేట మొదలు పెట్టారు.

కేపి చౌదరి లిస్ట్ తో పాటు గతంలో బెంగుళూరు డ్రగ్స్ కేస్ లోనూ కలహర్ రెడ్డి ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఇక ఇప్పుడు హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేయనున్నారు నార్కోటిక్ పోలీసులు.

You may also like

Leave a Comment