Telugu News » CM Revanth Reddy : ఆర్ఆర్ఆర్ ‎పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. మారనున్న నగర రూపురేఖలు..!!

CM Revanth Reddy : ఆర్ఆర్ఆర్ ‎పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. మారనున్న నగర రూపురేఖలు..!!

ఆర్ఆర్ఆర్​ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయడంపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో, సెమీ అర్బన్ జోన్​లో కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

by Venu
rrr-road

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad) రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను, ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ఆర్ఆర్ఆర్ (RRR) పనులకు టెండర్లు పిలవాలని ఆదేశించారు.

rrr-road

 

మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవుటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) లోపల అర్బన్ తెలంగాణ (Telangana), ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్.. రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందించాలని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకొన్నారు.

ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్​ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయడంపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో, సెమీ అర్బన్ జోన్​లో కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక భారత్​మాల పరియోజన ఫేజ్ ‌‌వన్‎లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తరం) 158.645 కిలోమీటర్ల మేరకు నిర్మించాలని భావించారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం, అవసరమైన భూసేకరణకు సగం వాటాగా నిధులు, భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ చేసినట్టు తెలుస్తోంది.. మరోవైపు ఆర్ఆర్ఆర్ (దక్షిణం) భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి, సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తలు మరియు తెలుగు న్యూస్ కోసమై ఇవి చదవండి…!

You may also like

Leave a Comment