Us open: అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి కోకో గాఫ్ (Coco Gauff)సంచలనం సృష్టించారు. బెలారస్ కు చెందిన టాప్ రెండో సీడ్ క్రీడాకారిణి అరీనా సబలెంకాను(Arina sabalenka) మట్టికరిపించి యూఎస్ ఓపెన్(us open) కైవసం చేసుకున్నారు. దీంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలిచిన అమెరికా రెండవ టీనేజర్ గా ఆమె రికార్డు సృష్టించారు. దీంతో కోకో గాఫ్ ను ప్రశంసిస్తూ పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.
శనివారం యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెలారస్కు చెందిన సబలెంకాతో కోకోగాఫ్ తలపడ్డారు. టైటిల్ కోసం ఇరువురు క్రీడాకారిణులు సుమారు 2 గంటల 6 నిమిషాల పాటు పోటీ పడ్డారు. తొలి సెట్లో కోకో గాఫ్ పై సబలెంకా 5-2 పాయింట్లతో పైచేయి సాధించారు. ఆ తర్వాత చెలరేగి ఆడిన కోకోగాఫ్ 6-3,6-2 దూసుకు పోయారు. దీంతో సబలెంకాపై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకున్నారు.
ఈ విజయంతో సెరెనా విలియమ్స్ తర్వాత గ్రాండ్ శ్లామ్ గెలిచిన తొలి అమెరికన్ టీనెజర్ గా ఆమె చరిత్ర సృష్టించారు. గత నెలలో గాఫ్ రెండు టైటిల్స్ సాధించారు. గతేడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియాటెక్ చేతిలో 1-6, 3-6 పాయింట్ల తేడాతో ఓడి పోయారు. మరోవైపు ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్) యూఎస్ సెమీఫైనల్ లో అభిమానులకు నిరాశ కలిగించాడు.
సుమారు మూడు గంటల పాటు సాగిన పోరులో డానియల్ మిద్దేదేవ్ చేతిలో 6-7 (3/7), 1-6, 6-3, 3-6 తేడాతో అల్క రాజ్ ఘోర పరాజయం పాలయ్యాడు. మరో వైపు ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫైనల్ చేరాడు. సెమీ ఫైనల్ లో బెన్ షెల్టన్(అమెరికా)తో జరిగిన మ్యాచ్ లో 6-3,6-2,7-6తో విజయం సాధించాడు. దీంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో మెద్వేదేవ్ తో ఆయన తలపడనున్నారు.