Telugu News » Congress : బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పోటీగా.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

Congress : బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పోటీగా.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

కృష్ణా జలాల్లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటా తెచ్చుకోలేని అసమర్థుడు కేసీఆర్ అని మండిపడ్డ వంశీచంద్ రెడ్డి.. కేసీఆర్ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశారని చెబుతున్నారని.. మరి దమ్ముంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.

by Venu
brs congress

రేపు చలో మేడిగడ్డ (Madigadda)కు బీఆర్ఎస్ (BRS) పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్దం అయిన బీఆర్ఎస్ నేతలు.. ఇందులో భాగంగా కాళేశ్వరంతో తెలంగాణ రైతాంగానికి కలిగిన లాభాన్ని ప్రాజెక్టు వద్దే వివరిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్న గులాబీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

congress-leaders-are-criticizing-brs-leaders

అయితే బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పోగ్రామ్ తో.. కాంగ్రెస్ పై యుద్ధానికి సిద్ధం అవుతుండగా.. టీ-కాంగ్రెస్ సైతం సంచలన నిర్ణయం తీసుకొంది. రేపు చలో మేడిగడ్డకు పోటీగా ‘చలో పాలమూరు-రంగారెడ్డి’ కార్యక్రమాన్ని చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి.. గాంధీ భవన్‌లో మాట్లాడారు. కన్నీళ్ల గాథలు కోకొల్లలుగా ఉన్న పాలమూరు జిల్లా ప్రజల తరఫున తాము మాట్లాడుతున్నామన్నారు.

పదేళ్లు పాటు కేసీఆర్ (KCR) పాలించినా పాలమూరు (Palamuru) జిల్లాకు ఒక్క చుక్క నీరు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్సాఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా నీళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు.. మరోవైపు కాంగ్రెస్ హయాంలో 262 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకుంటే, బీఆర్ఎస్ హయాంలో కేవలం 212 టీఎంసీల నీటినే వాడుకున్నారని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు..

కృష్ణా జలాల్లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటా తెచ్చుకోలేని అసమర్థుడు కేసీఆర్ అని మండిపడ్డ వంశీచంద్ రెడ్డి.. కేసీఆర్ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశారని చెబుతున్నారని.. మరి దమ్ముంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామన్నారు. చేయవలసిన నష్టాన్ని చేసి.. మీ తప్పులను ప్రభుత్వంపై మోపడం సరికాదని వెల్లడించారు.. ఈ క్రమంలో చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ ‘చలో పాలమూరు-రంగారెడ్డి’ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు.

You may also like

Leave a Comment