Telugu News » Medaram Jatara: హుండీ లెక్కింపు.. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటోలు..!

Medaram Jatara: హుండీ లెక్కింపు.. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటోలు..!

మేడారం సమ్మక్క-సారలమ్మ(Sammakka-saralamma) జాతర నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు సమర్పించిన కానుక‌ల హుండీలను అధికారులు లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో కరెన్సీ నోట్ల(Currency notes)పై మహాత్మా గాంధీ ఫొటోకు బదులు డా.బిఆర్.అంబేడ్కర్(Dr. BR Ambedkar) ఫొటో ఉండటంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.

by Mano
Medaram Jatara: Hundi counting.. Ambedkar's photos on currency notes..!

మేడారం సమ్మక్క-సారలమ్మ(Sammakka-saralamma) జాతర నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. కోటిన్నరకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అయితే, భక్తులు సమర్పించిన కానుక‌ల హుండీలను అధికారులు లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో కరెన్సీ నోట్ల(Currency notes)పై మహాత్మా గాంధీ ఫొటోకు బదులు డా.బిఆర్.అంబేడ్కర్(Dr. BR Ambedkar) ఫొటో ఉండటంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.

Medaram Jatara: Hundi counting.. Ambedkar's photos on currency notes..!

అయితే, మొత్తం 518 హుండీల‌ను ఏర్పాటు చేయగా వాటిని లెక్కించేందుకు హ‌నుమ‌కొండ‌లోని టీటీడీ క‌ళ్యాణ‌ మండ‌పానికి తీసుకువస్తారు. లెక్కింపు కార్యక్రమం దాదాపు 10 రోజుల‌పాటు జ‌రగనుంది. డబ్బులు లెక్కిస్తున్న సమయంలో లభించిన కరెన్సీ చూసి అధికారులు షాక్ అయ్యారు. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోకు బదులు డా.బిఆర్.అంబేడ్కర్ ఫొటో ఉండంతో అందరూ ఆశ్చర్యపోయారు.

మొదట తెరిచిన హుండీలలో నకిలీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. బీఆర్.అంబేడ్కర్ ఫొటోతో ముద్రించిన న‌కిలీ రూ. వంద నోట్లు బయటపడ్డాయి. అయితే, అంబేడ్కర్ బొమ్మను క‌రెన్సీ నోట్లపై ముద్రించాల‌న్న డిమాండ్లు వస్తున్న తరుణంలో ఈ విషయాన్ని జ‌నం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు 2020జాతర సమయంలో రూ. 11 కోట్ల 17 ల‌క్షలు, 2022 కరోనా సమయంలో రూ. 10 కోట్ల 91 ల‌క్షలు కానుకల రూపంలో వచ్చినట్లు అధికారులు తెలిపారు. హన్మకొండ టీటీడీ కళ్యాణమండపంలో హుండీల కౌంటింగ్ ప్రక్రియ పటిష్ట బందోబస్తు మధ్య జరుగుతోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో దేవాదాయశాఖ అధికారులు, మేడారం పూజారుల సమక్షంలో హుండీలు లెక్కిస్తున్నారు.

You may also like

Leave a Comment