Telugu News » Congress : మీ మాటలు వింటే పరువుకే పరువు పోతుంది. కేటీఆర్ పై ఫైర్ అయిన నేతలు..!

Congress : మీ మాటలు వింటే పరువుకే పరువు పోతుంది. కేటీఆర్ పై ఫైర్ అయిన నేతలు..!

నాటి నుంచి నేటి వరకూ న్యాయ ప్రకారంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మీ తాటాకు చప్పుళ్లకు భ‌యపడేది కాదన్నారు. కేటీఆర్ డిప‌మేశన్ కంప్లైంట్లకు ఎవరు భయపడుతారని పేర్కొన్నారు..

by Venu

రాష్ట్ర రాజకీయాల్లో విమర్శలు తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) ఒకరి మీద ఒకరు ఆరోపణ అస్త్రాలను గ్యాప్ లేకుండా వదులుకొంటున్నారు.. ఈ క్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy).. నేడు గాంధీ భవన్‌లో మీడియతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) తీరుపై మండిపడ్డారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్ ను తలపిస్తున్నాయని విమర్శించారు..

ఆ మాటలకు.. చేష్టలకు విసుగు చెందిన తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిన సిగ్గు రావడం లేదని వ్యాఖ్యానించారు. పోలీసుల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని కేసీఆర్‌ పెంచి పోషించారని, ఆ సైన్యంతోనే ఫోన్‌ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. వారే నిజాలు ఒప్పుకొంటుండగా.. ఎక్కడ పరువు పోతుందో అనే భయంలో కేటీఆర్ (KTR) ఇంకా ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు..

ఈ వ్యవహారంలో లీగల్ నోటీసులు ఇస్తానని ట్విట్టర్ పిట్ట చెబుతుండటం సిగ్గుచేటన్నారు. అసలు కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా అని ప్రశ్నించిన యెన్నెం.. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో గుర్తు తెచ్చుకొని మాట్లాడాలని మండిపడ్డారు.. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ముందు మీ ఆస్తులు ఎన్ని ప్రస్తుత ఆస్తులు ఎన్ని అని ప్రశ్నించిన శ్రీనివాస్ రెడ్డి.. ఈ విషయంలో లీగల్ గా ఫైట్ చేద్దామా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు..

టెలిగ్రాఫ్ ఆక్ట్ ప్రకారం ట్యాపింగ్ చేయడం దేశ ద్రోహమని, మీ ప్రవర్తనల వల్ల రాష్ట్ర పరువు పోయిందని మండిపడ్డ ఎమ్మెల్యే.. పరువు లేని మీరు పరువు నష్ట దావా వేసే నైతిక హక్కులేదని పేర్కొన్నారు.. మరోవైపు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ కేకే మహేందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీద నడుస్తోంది. ఈ గ్యాంబ్లింగ్ లో ఉన్న వారు ఎవరో ప్రజలకు గమనించారని తెలిపారు.

నాటి నుంచి నేటి వరకూ న్యాయ ప్రకారంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మీ తాటాకు చప్పుళ్లకు భ‌యపడేది కాదన్నారు. కేటీఆర్ డిప‌మేశన్ కంప్లైంట్లకు ఎవరు భయపడుతారని పేర్కొన్నారు.. పరువున్నొడు పరువు గురించి మాట్లాడాలి.. కానీ అది లేని వారు కూడా మాట్లాడితే ఆ పరువుకే పరువు పోతుందని మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.. దొంగే దొంగ అన్నట్టుగా మీ వ్యవహారం ఉందని చురకలు అంటించారు..

You may also like

Leave a Comment