-అంతర్మధనంలో బీఆర్ఎస్ నేతలు..
-పోటీకి సిట్టింగ్ ఎంపీల వెనుకడుగు..
-కేసీఆర్ వ్యూహాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్..
రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్.. శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్న విషయం తెలిసిందే.. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు.. ఓటమి తర్వాత ఆలోచనలో పడింది.. కానీ అప్పటికే గులాబీ బాస్ ఆస్పత్రిలో ఉన్నాడు.. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పరిస్థితి.. వరద బాధితుల్లా మారిందని అనుకొంటున్నారు.. అదీగాక అధికారంలో ఉన్నప్పుడు.. హాల్ చల్ చేసి ఇప్పుడు కామ్ గా ఐదు సంవత్సరాలు ఉండటం సాధ్యమా?..
అందులో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలో, అజ్ఞాత వాసంలో ఉన్నట్టు ఉండటం సాధ్యం కాదనే ఆలోచనలో కొందరు నేతలు ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇదే సమయంలో పోయిన చోట వెతుక్కునే అవకాశం మళ్ళీ ఐదు సంవత్సరాలకు గానీ రాదు.. అందుకే కనీసం లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అయిన మళ్లీ సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు..
కానీ రాష్ట్రంలో పది సంవత్సరాలు టాప్ గేర్ లో వెళ్ళిన బీఆర్ఎస్.. ఒక్క సారిగా అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) చతికిల పడటంతో.. సిట్టింగ్ సీట్లలో పోటీ చేసేందుకు ఎంపీలు నిరాసక్తత చూపిస్తున్నట్టు చర్చలు మొదలైయ్యాయి.. అదీగాక ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు జరుగుతోన్న ప్రచారం.. బీఆర్ఎస్ పెద్దలకి నిదురపట్టనీయడం లేదని అంటున్నారు..
వీరు కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కారు దిగే ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి..అయితే గత ఐదేళ్లలో ఎంపీలుగా ఎదురైన అనుభవంతో కొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే.. మరికొందరు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం 9 మంది లోక్ సభ సభ్యులు ఉన్నారు.
వీరిలో ఆర్థికంగా బలమున్నవారు పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అదీగాక రేవంత్ రెడ్డితో.. సిట్టింగ్ ఎంపీల్లో ఎక్కువ మందికి గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ప్రచారంలో ఉంది.. టీఆర్ఎస్ (TRS) మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు.. కేసీఆర్ (KCR) ఏదైతే వ్యూహాన్ని అమలు చేశారో.. ప్రస్తుతం కాంగ్రెస్ సైతం ఇదే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే అసంతృప్తులు ఎప్పుడైనా పార్టీలో చేరవచ్చనే సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ బాస్ ఎలాగైతే వలసలు ప్రోత్సహించి.. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసుకున్నారో.. ఇదే దారిలో కాంగ్రెస్ సక్సెస్ అయితే.. పది సంవత్సరాల వరకు అధికారానికి ఢోకా ఉండదనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సంఖ్య తేడా వస్తే.. గులాబీ నేతలు గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళనలో ఉన్నట్టు చర్చించుకొంటున్నారు..