Telugu News » Money Laundering : కేటీఆర్-కవితకు ప్రారంభమైన కౌంట్ డౌన్.. ఆ కేసులో జైలుకు వెళ్ళడం ఖాయమా..??

Money Laundering : కేటీఆర్-కవితకు ప్రారంభమైన కౌంట్ డౌన్.. ఆ కేసులో జైలుకు వెళ్ళడం ఖాయమా..??

డియర్ కేటీఆర్ బ్రదర్, కవితక్క..అంటూ వారిద్దరిపై చురకలు అంటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సాధించిన ఫలితాలకు అభినందనలు. మీ అబద్ధాలు, అవినీతి, అత్యాశ తెలుగు ప్రజలకు అర్థమైనట్లే మీ అహంకారం కూడా అంతమవుతుందని కొన్ని నెలల క్రితం నేను చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

by Venu
ed notice to mlc kavitha in delhi liquor scam case

మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇదివరకే ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ పలు లేఖలు విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్‌ (Sukhesh Chandrashekar) తాజాగా విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్.. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలిపేలా ఉన్న లేఖను విడుదల చేశారు..

కవిత, కేటీఆర్ (KTR) అవినీతి త్వరలో బయటపడుతుందని తెలిపిన సుఖేశ్ చంద్రశేఖర్.. మీరిద్దరూ త్వరలో జైలు క్లబ్‌లో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో విషయాన్ని పరిశీలిస్తే.. డియర్ కేటీఆర్ బ్రదర్, కవితక్క..అంటూ వారిద్దరిపై చురకలు అంటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సాధించిన ఫలితాలకు అభినందనలు. మీ అబద్ధాలు, అవినీతి, అత్యాశ తెలుగు ప్రజలకు అర్థమైనట్లే మీ అహంకారం కూడా అంతమవుతుందని కొన్ని నెలల క్రితం నేను చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

మీ గురించి తెలుసుకున్న ప్రజలు మీకు ఈ విధమైన తీర్పు ఇచ్చారు. మీరు నన్ను మోసగాడు అన్నారు. కానీ ఇవాళే మీరే మోసగాళ్లలా మిగిలిపోయారు. ఇప్పుడు మీకు, నాకు పెద్ద తేడా ఏమీ లేదు. మీరు అవినీతిపరులు కాదని నిరూపించుకునేందుకు సిద్ధమవ్వండి. మీరు కూడా జైలు క్లబ్‌లో చేరడానికి ఎంతో సమయం లేదు.. త్వరలో మీరంతా అమెరికాకు పయనమవుతారని భావిస్తున్నానంటూ సుఖేశ్ లేఖలో పేర్కొన్నారు.

చట్టం, సామాన్యుడి కంటే ఈ దేశంలో ఎవరూ శక్తివంతులు కాదు. కేటీఆర్ బ్రదర్ ఫలితాల రోజు ఎక్స్‌లో తుపాకీ పట్టుకుని 3.0 అని మీరు పెట్టిన పోస్ట్ చూశాను. మీరు చెప్పిన 3.0 జైలు జీవితం త్వరలోనే ప్రారంభమవుతుందని ముగించిన సుఖేశ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు అభినందనలు అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సుఖేష్ విడుదల చేసిన లేఖ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

You may also like

Leave a Comment