Telugu News » Mudu Chintalapalli : యథేచ్ఛగా కబ్జా చేస్తున్న ప్రభుత్వ భూమి.. ఆందోళనలో గ్రామస్తులు..!!

Mudu Chintalapalli : యథేచ్ఛగా కబ్జా చేస్తున్న ప్రభుత్వ భూమి.. ఆందోళనలో గ్రామస్తులు..!!

ప్రస్తుతం ఉన్న అధికారులైన స్పందించి వెంటనే ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అద్రాస్ పల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. స్థానిక అధికార యంత్రాంగం పట్టించుకోకుంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంటున్నారు..

by Venu

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో భారీగా భూములు (Lands) కబ్జాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన భూములను, ప్రైవేటు వ్యక్తులు కబ్జాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా ఇలాంటి భాగోతమే మూడు చింతలపల్లి (Mudu Chintalapalli) మండలంలో వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అద్రాస్ పల్లి (Addras Palli) గ్రామంలో సర్వేనెంబర్ 235లో ఉన్న సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై గతంలో కలెక్టర్ కు, తహశీల్దార్ కు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి మేడ్చల్ కలెక్టరేట్ (Collectorate) ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు.

జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకొని, అద్రాస్ పల్లిలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం అద్రాస్ పల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లగా వారు తీసుకోలేదని సమాచారం..

మరోవైపు ప్రస్తుతం ఉన్న అధికారులైన స్పందించి వెంటనే ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అద్రాస్ పల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. స్థానిక అధికార యంత్రాంగం పట్టించుకోకుంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంటున్నారు..

You may also like

Leave a Comment