Telugu News » COVID-19 : ప్రపంచానికి డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ హెచ్చరిక.. డిసెంబర్‌లో పెరిగిన కరోనా మరణాలు..!!

COVID-19 : ప్రపంచానికి డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ హెచ్చరిక.. డిసెంబర్‌లో పెరిగిన కరోనా మరణాలు..!!

టెడ్రోస్‌ అథనామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి ప్రపంచ దేశాలను ఈ వైరస్ వణికించే అవకాశాలు సైతం ఉన్నా భయపడవలసిన అవసరం లేదన్నారు. కరోనా వల్ల గతేడాది నవంబర్‌ నెలలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరిన వారి సంఖ్య 42 నుంచి 62 శాతానికి పెరిగిందని, ముందుగానే ఈ వైరస్ పట్ల అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

by Venu

రెండేండ్లు ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కొవిడ్ (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ఘెబ్రెయెస్ (Tedros Adhanom Ghebreyesus) అన్నారు.

Covid-19: Again corona chaos.. Five people in the same family are positive..!

గత సంవత్సరం నుంచి చాపకింద నీరులా.. ప్రపంచ దేశాల్లో పాక్షికంగా ప్రబలుతోన్న కొవిడ్.. పెద్ద ముప్పుగా మారిందని వెల్లడించారు. అందులో కరోనా మహమ్మారి వల్ల ఒక్క డిసెంబరు నెలలోనే 10 వేలమందికి పైగా మరణించారని తెలిపారు. అమెరికా, యూరప్‌ దేశాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉందన్నారు. క్రిస్మస్ (Christmas) సెలవుల కాలంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు..

మరోవైపు  టెడ్రోస్‌ అథనామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి ప్రపంచ దేశాలను ఈ వైరస్ వణికించే అవకాశాలు సైతం ఉన్నా భయపడవలసిన అవసరం లేదన్నారు. కరోనా వల్ల గతేడాది నవంబర్‌ నెలలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరిన వారి సంఖ్య 42 నుంచి 62 శాతానికి పెరిగిందని, ముందుగానే ఈ వైరస్ పట్ల అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వ్యక్తిగత రక్షణకు, కరోనా పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వాలను కోరారు. ఎప్పటికప్పుడు వైరస్‌పై నిఘా ఉంచాలని తెలిపిన ఆరోగ్య సంస్థ చీఫ్‌.. ప్రజలు పరీక్షలు చేయించుకోవడంతో పాటు, ముందుజాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలని, మాస్కులు ధరించాలన్నారు. మరోవైపు 2023 మే నెలలో, డబ్ల్యూహెచ్‌వో.. కొవిడ్-19 అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ముగిసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మళ్ళీ కొవిడ్ కేసులు నమోదవడం ప్రపంచాన్ని కలవరానికి గురుచేస్తోంది..

You may also like

Leave a Comment